ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెన్నై-కన్నియాకుమారి మధ్య ఇండస్ట్రియల్‌ కారిడార్‌

ABN, First Publish Date - 2021-06-18T13:46:10+05:30

రాష్ట్రంలో రహదారుల అనుసంధాన ప్రక్రియ మరింత ఊపందుకుంది. రహదారులను అభివృద్ధిపరిచేలా చెన్నై-కన్నియాకుమారి మధ్య పారిశ్రామిక రహదారి(ఇండస్ట్రియల్‌ కారిడార్‌) రూ.3,573 కోట్లతో చేప

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

    - రూ.3,573 కోట్ల రుణ సహాయానికి ఒప్పందం


చెన్నై: రాష్ట్రంలో రహదారుల అనుసంధాన ప్రక్రియ మరింత ఊపందుకుంది. రహదారులను అభివృద్ధిపరిచేలా చెన్నై-కన్నియాకుమారి మధ్య పారిశ్రామిక రహదారి(ఇండస్ట్రియల్‌ కారిడార్‌) రూ.3,573 కోట్లతో చేపట్టేలా రుణసహాయానికి సంబంధించిన ఒప్పందం జరిగింది. ఆసియా అభివృద్ధి బ్యాంక్‌, కేంద్రప్రభుత్వం సంయుక్తంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్టు కోసం రూ.3,573 కోట్ల రుణ సహాయానికి ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ ఇండియా డైరెక్టర్‌ డేకియోకోనిషియం, కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్థ్ధికాభివృద్ధి విభాగ అదనపు కార్యదర్శి రంజిత్‌కుమార్‌ మిశ్రా ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ ప్రాజెక్టు తూర్పు తీరం పారిశ్రామికాభివృద్ధి మండలంలో భాగంగా పశ్చిమబెంగాల్‌ నుంచి చెన్నై-కన్నియాకుమారి పారిశ్రామిక రహదారి ఏర్పాటు కానుంది. రాష్ట్రంలో 23 జిల్లాల్లో సుమారు 590 కి.మీ మేర రాష్ట్ర రహదారులు విస్తరించనున్నాయి. తీరప్రాంతాల్లోని పారిశ్రామికవాడలు, హార్బర్లు అనుసంధానం చేసేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ రహదారి రూపుదిద్దుకోనుంది. ఈ ప్రాజెక్టు ఆయా జిల్లాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు, చిన్న హార్బర్ల అభివృద్ధి జరిగి ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.


Updated Date - 2021-06-18T13:46:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising