ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chennai: రూ.300 కోట్ల స్థలాన్ని తిరిగి దక్కించుకున్న కంచి ఆలయం

ABN, First Publish Date - 2021-09-30T23:30:17+05:30

తమిళనాడు హిందూ రెలిజియస్ అండ్ ఛారిటబుల్ ఎండోమెంట్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : తమిళనాడు హిందూ రెలిజియస్ అండ్ ఛారిటబుల్ ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ కోట్లాది రూపాయల విలువైన దేవాలయ భూమిని దురాక్రమణదారుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకుంది. పూనమల్లె హై రోడ్ సమీపంలో ఉన్న ఈ భూమి విస్తీర్ణం సుమారు ఓ ఎకరా ఉంటుంది, దీని విలువ దాదాపు రూ.300 కోట్లు. ఇది కాంచీపురం ఏకాంబరేశ్వరన్ దేవస్థానానికి చెందినది. 


హిందూ రెలిజియస్ అండ్ ఛారిటబుల్ ఎండోమెంట్ మంత్రి పీకే శేఖర్ బాబు ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, కాంచీపురం ఏకాంబరేశ్వరన్ దేవస్థానానికి చెందిన దాదాపు ఓ ఎకరా భూమిని దురాక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీని విలువ సుమారు రూ.300 కోట్లు ఉంటుందన్నారు. ఈ భూమిలో కొన్ని నిర్మాణాలు ఉన్నాయని, వీటిని ఉపయోగించుకోవడం సాధ్యమవుతుందా? అనే అంశంపై నిర్ణయించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. 


తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సుమారు రూ.1,000 కోట్ల విలువైన భూములను దురాక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ భూములు మళ్ళీ దురాక్రమణదారులపరం కాకుండా తగిన చర్యలు చేపడుతున్నామన్నారు. 


Updated Date - 2021-09-30T23:30:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising