ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిబంధనలు పాటించని Banners వద్దు

ABN, First Publish Date - 2021-12-02T16:20:28+05:30

నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటుచేసే బ్యానర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని మద్రాసు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వా న్ని ఆదేశించింది. విల్లుపురంలో ఓ వివాహ కార్యక్రమానికి సంబంధించి బ్యానర్‌ ఏర్పాటుపనుల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                     - Highcourt ఆదేశం


ప్యారీస్‌(చెన్నై): నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటుచేసే బ్యానర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని మద్రాసు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వా న్ని ఆదేశించింది. విల్లుపురంలో ఓ వివాహ కార్యక్రమానికి సంబంధించి బ్యానర్‌ ఏర్పాటుపనుల్లో పాల్గొన్న 12 ఏళ్ల బాలుడు దినేష్‌ విద్యుదా ఫూతంతో మృతిచెందిన విషయం తెలిసిందే. గత ఏడాది చోటుచేసుకున్న ఈ సంఘటనపై విల్లుపురానికి చెందిన మోహన్‌రాజ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విల్లుపురంలో చట్టవిరుద్ధంగా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని అడ్డుకోవాల్సిందిగా రాష్ట్రప్రభుత్వానికి ఉత్తర్వులు జారీచేయడం తో పాటు, మృతుడు దినేష్‌ కుటుంబానికి ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందించేలా ఉత్తర్వులు జారీచేయాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మునీశ్వర్‌నాథ్‌ భండారీ, న్యాయమూర్తి జస్టిస్‌ ఆదికేశవులతో కూడిన బెంచ్‌ విచారణకు స్వీకరించగా, డీఎంకే, ప్రభుత్వం, గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్ల తరఫున హాజరైన న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. అనంతరం రాష్ట్రంలో బ్యానర్ల సంస్కృతికి చరమగీతం పాడాలని, రాజకీయపార్టీలతో పాటు మిగతా వారు కూడా నిబంధనలకు విరుద్ధంగా బ్యానర్లు ఏర్పాటుచేయడాన్ని ప్రభుత్వం అనుమతించరాదని ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Updated Date - 2021-12-02T16:20:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising