ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chennai: సేలంలో రూ.40 లక్షల గంజాయి స్వాధీనం

ABN, First Publish Date - 2021-07-19T18:07:19+05:30

జిల్లా కేంద్రమైన సేలంలో రూ.40 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకుని, నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే, పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ నుంచి కార్లు, జీపుల ద్వారా అక్రమంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నలుగురి అరెస్టు

చెన్నై/అడయార్: జిల్లా కేంద్రమైన సేలంలో రూ.40 లక్షల   విలువైన గంజాయిని స్వాధీనం చేసుకుని, నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే, పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ నుంచి కార్లు, జీపుల ద్వారా అక్రమంగా గంజాయిని భారీ మొత్తంలో జిల్లాకు తరలిస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో జిల్లా పోలీసులు ప్రత్యేక బృందాల ను ఏర్పాటు చేసి వాహనాల తనిఖీ ముమ్మరం చేశాయి. అందులో ఆదివారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో డీఎస్పీ మనోహరన్‌ నేతృత్వంలోని పోలీసు బృందం సేలం కారిపట్టి ప్రధాన రహ దారి, రామలింగాపురం జంక్షన్‌ రోడ్డులో వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో జీపు, మినీ ట్యాంకర్‌ను ఆపి తనిఖీ  చేయగా అందులో 400 కిలోల గంజాయి పొడి ఉన్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి సేలంకు చెందిన వెంకటేశన్‌, మదురైకు చెందిన ఆండిస్వామి, ధనభాగ్యం, అళగేశన్‌ అనే వారిని అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ మార్కెట్‌లో రూ.40 లక్షల వరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. దీన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిస్తున్నట్టు నిందితులు వెల్లడించారు. 

Updated Date - 2021-07-19T18:07:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising