ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లామా, అల్‌పాకస్‌ యాంటీబాడీలతో కరోనాకు చెక్‌!

ABN, First Publish Date - 2021-01-14T07:21:26+05:30

చూడటానికి ఒంటెల్లా కనిపించే లామా, అల్‌పాకస్‌ జంతువుల నుంచి సేకరించిన యాంటీబాడీలతో కరోనా వైర్‌సకు చెక్‌ పెట్టొచ్చని జర్మనీలోని బాన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జనవరి 13 : చూడటానికి ఒంటెల్లా కనిపించే లామా, అల్‌పాకస్‌ జంతువుల నుంచి సేకరించిన యాంటీబాడీలతో కరోనా వైర్‌సకు చెక్‌ పెట్టొచ్చని జర్మనీలోని బాన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. వాటిని ఉపయోగించి వైర్‌సలోని వివిధ భాగాలపై దాడి చేయగల ప్రభావవంతమైన మాలిక్యూల్స్‌ను అభివృద్ధి చేసినట్లు వారు వెల్లడించారు. అధ్యయనంలో భాగంగా లామా, అల్‌పాక్‌సలలోకి కరోనా వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌ను ఇంజెక్ట్‌ చేయగా, వాటి రోగ నిరోధక వ్యవస్థ వైర్‌సను తిప్పికొట్టే యాంటీబాడీలను విడుదల చేసినట్లు తెలిపారు. ఇది జరిగిన కొన్ని వారాల తర్వాత ఆ జంతువుల రక్త నమూనాలను సేకరించి విశ్లేషించి, కరోనా వ్యతిరేక యాంటీబాడీల జన్యుసమాచారాన్ని గుర్తించారు. ఈ వివరాలను వడపోసి.. ప్రత్యేకించి వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌ను లక్ష్యంగా ఎంచుకుంటున్న యాంటీబాడీలను పసిగట్టారు. వాటిని ల్యాబ్‌లో పరీక్షించగా.. లామా, అల్‌పాక్‌సలలో విడుదలైన నాలుగు యాంటీబాడీలు కరోనా వైర్‌సకు ఆయువు పట్టుగా ఉండే స్పైక్‌ ప్రొటీన్‌పై ముప్పేట దాడి చేస్తున్నట్లు నిర్ధారణ అయింది. 

Updated Date - 2021-01-14T07:21:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising