ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగు చట్టాల రద్దు కోరుతూ గవర్నర్‌కు సీఎం మెమొరాండం

ABN, First Publish Date - 2021-10-05T20:05:33+05:30

కేంద్రం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ పంజాబ్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: కేంద్రం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఒక విజ్ఞాపన పత్రాన్ని గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌కు అందజేశారు. క్యాబినెట్ మంత్రులతో కలిసి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను ముఖ్యమంత్రి కలిసి మెమొరాండం ఇచ్చినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. రైతుల్లో నెలకొన్న అసంతృప్తికి కారణమైన మూడు సాగు చట్టాలను అత్యవసరంగా సమీక్షించి, రద్దు చేయాలని గవర్నర్‌ను సీఎం కోరినట్టు పేర్కొంది.


లఖింపూర్ ఖేరి ఘటనకు సాగు చట్టాలే కారణం..

కాగా, లఖింపూర్ హింసాత్మక ఘటనలో నలుగురు రైతులతో సహా ఎనిమిది మంది మృతి చెందడం దురదృష్టకరమని మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చన్నీ అన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు వివాదాస్పద సాగు చట్టాలే కారణమని అన్నారు. తక్షణమే సాగుచట్టాలను రద్దు చేయాలని గవర్నర్‌ను కలిసి మెమొరాండం ఇచ్చినట్టు చెప్పారు.

Updated Date - 2021-10-05T20:05:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising