ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఊమన్ చాందీ, ఏఐసీసీ ప్రదాన కార్యదర్శి వేణుగోపాల్‌పై సీబీఐ ఎఫ్ఐఆర్

ABN, First Publish Date - 2021-08-17T18:46:07+05:30

మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొచ్చి: మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కేరళ మాజీ మఖ్యమంత్రి ఊమన్ చాందీ, కాంగ్రెస్ ఎంపీలు అదూర్ ప్రకాష్, హిబి ఎడిన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏపీ అనిల్‌ కుమార్‌పై సీబీఐ మంగళవారంనాడు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సోలార్ కుంభకోణం కేసుకు సంబంధించి ఈ వేధింపులకు పాల్పడ్డారనే సీబీఐ ఆరోపిస్తోంది. బీజీపీ జాతీయ ఉపాధ్యక్షుడు ఏపీ అబ్దుల్‌కుట్టీ పేరు కూడా ఎఫ్ఐఆర్‌లో ఉంది. తిరువనంతపురం చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టుకు సీబీఐ మంగళవారంనాడు ఈ ఎఫ్ఐఆర్ సమర్పించింది. ఈ కేసును సీబీఐ తిరువనంతపురం విభాగం దర్యాప్తు చేస్తోంది. ఈ కేసును అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. పోలీసు ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం మహిళా పారిశ్రామికవేత్తపై జరిగిన ఈ వేధింపులన్నీ మంత్రుల అధికార నివాసాలు, ఎమ్మెల్యే హోస్టళ్లు, హోటల్ రూమ్‌లలో జరిగాయి. 2018లో వీరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Updated Date - 2021-08-17T18:46:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising