ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చండీఘడ్ నుంచి మండీ,కులూ,రాంపూర్‌లకు helicopter services

ABN, First Publish Date - 2021-12-10T17:48:39+05:30

చండీగఢ్ నుంచి హిమాచల్ ప్రదేశ్‌కి విమాన కనెక్టివిటీ ఊపందుకుంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీఘడ్: చండీగఢ్ నుంచి హిమాచల్ ప్రదేశ్‌కి హెలికాప్టర్రె కనెక్టివిటీ ఊపందుకుంది. ఇప్పుడు చండీగఢ్ నుంచి సిమ్లా మీదుగా మండీ, కులూ, రాంపూర్‌ నగరాలకు హెలికాప్టర్ టాక్సీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. హెలీ టాక్సీ సిమ్లా మీదుగా మండీ, కులూ మీదుగా రాంపూర్‌లను కలుపుతుంది.115 కిలోమీటర్ల దూరం ఉన్న సిమ్లా-చండీగఢ్ మార్గంలో కారులో వెళ్లాలంటే మూడు గంటల సమయం పడుతుంది.చండీగఢ్ -సిమ్లాల మధ్య ఇప్పటికే ఉడాన్-2 కింద హెలికాప్టర్ టాక్సీ సర్వీస్ ద్వారా అనుసంధానించారు. ‘‘హెలీ టాక్సీ సిమ్లా చేరుకోవడానికి దాదాపు 30 నిమిషాలు పడుతుంది. అక్కడ 25 నిమిషాల స్టాప్ తర్వాత, అది మండీకి వెళుతుంది, అక్కడ 15 నిమిషాలు ఆగుతుంది. ఆ తర్వాత హెలికాప్టర్ టాక్సీ కులూకి వెళుతుంది. సిమ్లాకు తిరిగి వెళ్లే మార్గం రాంపూర్‌ను తాకుతుంది’’అని అధికారులు చెప్పారు. 


హెలీ టాక్సీ సోమ, శుక్ర, శనివారాల్లో వారానికి మూడుసార్లు నడుస్తుంది. చండీగఢ్ నుంచి సిమ్లా-మండీ-ధర్మశాల, రాంపూర్‌లకు ఈ సర్వీస్ మంగళ, బుధ, గురువారాల్లో నడుస్తుందని అధికారులు చెప్పారు. 30 నిమిషాల హెలికాప్టర్ ప్రయాణానికి టికెట్ ధర రూ. 2,999గా నిర్ణయించారు.చండీగఢ్ విమానాశ్రయం నుంచి హిమాచల్ ప్రదేశ్‌కు పవన్ హన్స్ హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం, సిమ్లా, ధర్మశాల, కులూలకు హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ సర్వీస్ ఆపరేటర్ పవన్ హన్స్ లిమిటెడ్‌తో కలిసి 2018వ సంవత్సరం జూన్ 4వతేదీ నుంచి   చండీగఢ్-సిమ్లా మార్గంలో హెలీ-టాక్సీ సేవలను ప్రారంభించింది.


Updated Date - 2021-12-10T17:48:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising