ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ల‌క్ష‌మందికి ఉచితంగా రామ్‌దేవ్ క‌రోనిల్ కిట్లు

ABN, First Publish Date - 2021-05-25T12:34:57+05:30

ల‌క్ష‌మంది క‌రోనా బాధితులకు రాష్ట్ర ప్ర‌భుత్వం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగ‌ఢ్‌: ల‌క్ష‌మంది క‌రోనా బాధితులకు రాష్ట్ర ప్ర‌భుత్వం ఉచితంగా కరోనిల్ కిట్‌ల‌ను పంపిణీ చేయ‌నుంద‌ని హ‌రియాణా ఆరోగ్యశాఖ‌ మంత్రి అనిల్ విజ్ ఒక ట్వీట్ ద్వారా  తెలియజేశారు. పతంజలి సంస్థ త‌యారుచేసిన కరోనిల్ కిట్‌ల‌ను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు, ఇందుకోసం స‌గం ఖ‌ర్చును సంస్థ భ‌రిస్తుంద‌ని, మ‌రో స‌గం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంద‌న్నారు. 


వైద్యులపై బాబా రామ్‌దేవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్య‌ల మధ్య అనిల్ విజ్ క‌రోనిల్ కిట్ల‌ పంప‌ణీ ప్ర‌క‌ట‌న మ‌రింత వివాదాస్ప‌దంగా మారింది. కరోనా మహమ్మారి నుంచి కాపాడేందుకు బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి  సంస్థ క‌రోనిల్ కిట్‌ను మార్కెట్‌లోకి తీసుకువ‌చ్చింది. అయితే దీనిపై వివాదాలు చెల‌రేగ‌డంతో ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంద‌ని సంస్థ పేర్కొంది. తాజాగా బాబా రామ్‌దేవ్ మోడరన్ మెడిక‌ల్‌ సైన్స్ వైద్యులను, అల్లోపతి వైద్యాన్ని విమర్శించారు. ఇది వివాదాస్ప‌దం కావ‌డంతో రామ్‌దేవ్ బాబా క్షమాపణలు కోరారు.

Updated Date - 2021-05-25T12:34:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising