ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకంలో కోత?

ABN, First Publish Date - 2021-01-25T07:48:34+05:30

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భగ్గుమంటున్నాయి. ధరల పెరుగుదలతో వాహనదారులపై ఆర్థికభారం పెరుగుతూనే ఉంది. ఇంతకు ముందెన్నడూ లేని స్థాయిలో ఇంధనాల ధరలు ఉండటంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యోచిస్తున్న కేంద్రం.. బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం

సుంకం తగ్గితే వాహనదారులపై పెట్రో భారం తగ్గే చాన్స్‌


న్యూఢిల్లీ, జనవరి 24: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భగ్గుమంటున్నాయి. ధరల పెరుగుదలతో వాహనదారులపై ఆర్థికభారం పెరుగుతూనే ఉంది. ఇంతకు ముందెన్నడూ లేని స్థాయిలో  ఇంధనాల ధరలు ఉండటంతో వాహనం బయటకు తీయాలంటేనే జడుసుకునే పరిస్థితులు నెలకొంటున్నాయి. ధరలు ఇంకా పెరుగుతాయన్న సంకేతాలు వాహనదారుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాహనదారులపై ఇంధన ధరల భారాన్ని తగ్గించాలన్న యోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు వీలుగా ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.


సుంకాన్ని తగ్గించాలని సూచిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు పెట్రోలియం, సహజవాయువు శాఖ ఇప్పటికే లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ సర్కారు ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గిస్తే వాహనదారులకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంటుందని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే ఇంధనాల ధరలు రికార్డు స్థాయిలకెక్కాయి. అంతర్జాతీయ  మార్కెట్లో ముడిచమురు ధరలు ఎగబాకుతున్న నేపథ్యంలో దేశీయంగా వీటి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. 


ఎక్సైజ్‌ సుంకం పెంపుతో పెరిగిన భారం..

కొవిడ్‌ మూలంగా అనేక దేశాల్లో లాక్‌డౌన్‌ విధించడం, ప్రయాణాలపై ఆంక్షలు అమలు చేయడం వల్ల ముడిచమురు, ఇంధనాలకు డిమాండ్‌ ఒక్కసారిగా తగ్గిపోయింది. కానీ ఇప్పుడు కొవిడ్‌ వ్యాక్సిన్లు రావడంతో ఇంధనాలకు గిరాకీ పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర 55 డాలర్లు దాటేసింది. ఇంకా పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది ధరల పెరుగుదలకు దారితీస్తోంది. ఇక కేంద్రం ముడి చమురు ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఇంధనాలపై ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచింది. దీంతో లీటరు పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకం రూ.32.98కి, డీజిల్‌పై రూ.31.83కి పెరిగింది. లీటరుపై ఎక్సైజ్‌ సుంకం ఒక రూపాయి పెంచితే ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.14,500 కోట్లు సమకూరుతుందని అంచనా. లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపైనా దెబ్బపడింది. పలు రాష్ట్రాలు తమ ఆదాయాలను పెంచుకోవడానికి పెట్రో ఉత్పత్తులపై సుంకాలను పెంచాయి. ప్రస్తుతం ఢిల్లీలో చూస్తే లీటరు పెట్రోల్‌ ధరలో పన్నుల వాటా 62% ఉండగా.. డీజిల్‌ ధరలో పన్నులు 57%గా ఉన్నాయి. గతంలో పెట్రో ఉత్పత్తుల ధరలు గరిష్ఠ స్థాయిలకు చేరినప్పుడు కేంద్రం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించిన దాఖలాలున్నాయి.


ఆహా.. ‘జీడీపీ’లో ఎంత వృద్ధి.. రాహుల్‌ ఎద్దేవా

మోదీ సర్కారు హయాంలో పెరిగిన ఎక్సైజ్‌ సుంకం కారణంగానే పెట్రో ఉత్పత్తుల ధరలు మునుపెన్నడూ లేనంతగా గరిష్ఠస్థాయికి చేరాయని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. ‘జీడీపీ వృద్ధిలో మోదీజీ రికార్డే వేరు. జీడీపీ అంటే.. గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలన్న మాట!’ అని ఆయన వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. వారంలో నాలుగు సార్లు పెట్రోధరలను పెంచారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అజయ్‌ మాకెన్‌ దుయ్యబట్టారు. ఎక్సైజ్‌ సుంకం పెంపును ఉపసంహరించి ప్రజలకు తక్షణమే ఊరట కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ’

Updated Date - 2021-01-25T07:48:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising