ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

10 రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయ్.. కేంద్రం హెచ్చరిక

ABN, First Publish Date - 2021-07-31T23:29:22+05:30

10 రాష్ట్రాల్లో ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నాయని కేంద్రం తాజాగా హెచ్చరించింది. పాజిటివిటీ రేటు 10 శాతం కంటే అధికంగా ఉన్న జిల్లాల్లో కరోనా కట్టడి చర్యలు మరింత పకడ్బందీగా అమలు చేయాలని శనివారం సూచించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రస్తుతం 10 రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని కేంద్రం శనివారం హెచ్చరించింది. పాజిటివిటీ రేటు 10 శాతం కంటే అధికంగా ఉన్న జిల్లాల్లో కరోనా కట్టడి చర్యలు మరింత పకడ్బందీగా అమలు చేయాలని కూడా సూచించింది. తాజా సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా 46 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతం మార్కు దాటింది. మరో 53 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 నుంచి 10 శాతం మధ్య ఉంది. దీంతో..కరోనా నిర్ధారణ పరీక్షలు మరింత అధిక సంఖ్యలో నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా రాష్ట్రాలకు సూచించింది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఈ జిల్లాల్లో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని హెచ్చరించింది. కరోనా కేసులు అధికంగా వెలుగు చూస్తున్న కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, అసోం, మిజోరం, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రెటరీ రాజేశ్ భూషణ్ ఆధ్వర్యంలో శనివారం ఓ కీలక సమావేశం జరిగింది. కరోనా కట్టడి చర్యలు మరింత పకడ్బందీగా చేపట్టాలని ఈ సందర్భంగా రాజేశ్ భూషణ్ రాష్ట్రాలను కోరారు. 

Updated Date - 2021-07-31T23:29:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising