ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వార్షికాదాయంపై కేంద్రం సమీక్ష... నీట్-పీజీ కౌన్సెలింగ్ వాయిదా...

ABN, First Publish Date - 2021-11-25T22:14:06+05:30

ఆర్థికంగా బలహీన వర్గాలు (ఈడబ్ల్యూఎస్)కు చెందిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఆర్థికంగా బలహీన వర్గాలు (ఈడబ్ల్యూఎస్)కు చెందిన విద్యార్థులకు పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ప్రవేశాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు వార్షికాదాయ పరిమితి రూ.8 లక్షలును సమీక్షించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది ప్రవేశాలకు దీనిని సమీక్షిస్తామని సుప్రీంకోర్టుకు చెప్పింది. 


కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, నీట్ ప్రవేశాలకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ విద్యార్థుల వార్షికాదాయం క్రైటీరియాను నిర్ణయించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి నాలుగు వారాల సమయం అవసరమని చెప్పారు. ఇంతకు ముందు కోర్టుకు హామీ ఇచ్చినట్లుగానే నీట్-పీజీ కౌన్సెలింగ్‌ను మరో నాలుగు వారాలపాటు వాయిదా వేస్తామని తెలిపారు. 


దీంతో నీట్-పీజీ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్/ఓబీసీ కోటాను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను జనవరి 6కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈడబ్ల్యూఎస్ కోటా ఆచరణాత్మకంగానే ఉందని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తెలిపింది. ఈ విధానానికి రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతివ్వాలని చెప్పింది. 


Updated Date - 2021-11-25T22:14:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising