ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలో 50 శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యం

ABN, First Publish Date - 2021-06-18T14:00:02+05:30

దేశంలో 2024 వ సంవత్సరంకల్లా రోడ్డు ప్రమాదాల సంఖ్యను 50 శాతానికి తగ్గించాలనే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి

న్యూఢిల్లీ : దేశంలో 2024 వ సంవత్సరంకల్లా రోడ్డు ప్రమాదాల సంఖ్యను 50 శాతానికి తగ్గించాలనే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.ఫిక్కీ నిర్వహించిన వర్చువల్ సమావేశంలో కేంద్రమంత్రి గడ్కరీ మాట్లాడారు. దేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల ఏటా 1.5 లక్షలమంది మరణిస్తున్నారని, 2024వ సంవత్సరంకల్లా రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్యను 50 శాతానికి తగ్గిస్తామని చెప్పారు. దేశంలో డ్రైవర్ల కొరత తీర్చేందుకు 2వేల డ్రైవింగ్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి చెప్పారు. 


50 శాతం రోడ్డు ప్రమాదాలు రోడ్డు ఇంజినీరింగ్ సమస్యల వల్ల జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. స్వతంత్ర రోడ్ సేఫ్టీ కౌన్సిళ్లను రిటైర్డు ఐఎఎస్ అధికారి నేతృత్వంలో ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామని మంత్రి చెప్పారు.రాష్ డ్రైవింగ్ నివారణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రోడ్లను మెరుగుపర్చి ప్రమాదాల సంఖ్యను తగ్గిస్తామని మంత్రి గడ్కరీ వివరించారు.

Updated Date - 2021-06-18T14:00:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising