ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పీఎం కేర్స్’ వెంటిలేటర్లు: మరణాలు సంభవిస్తే కేంద్రానిదే బాధ్యత.. హైకోర్టు కీలక వ్యాఖ్య

ABN, First Publish Date - 2021-06-04T00:21:14+05:30

పీఎం కేర్స్ నిధులతో అందించిన వెంటిలేటర్ల కారణంగా మరణాలు సంభవిస్తే దానికి కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుంది బాంబే హైకోర్టు తేల్చిచెప్పింది. పీఎం కేర్స్ నిధులతో కొనుగోలు చేసిన వెంటిలేటర్లు తరచూ పాడవుతున్నాయని జీఎమ్‌సీహెచ్ ఆస్పత్రి అంచనాకు వచ్చిన నేపథ్యంలో హైకోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: పీఎం కేర్స్ నిధులతో కొనుగోలు చేసిన వెంటిలేటర్ల కారణంగా కొవిడ్ పేషెంట్లు మరణిస్తే దానికి కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుంది బాంబే హైకోర్టు తేల్చిచెప్పింది. పీఎం కేర్స్ నిధులతో కొనుగోలు చేసిన వెంటిలేటర్లు తరచూ పాడవుతున్నాయని జీఎమ్‌సీహెచ్ ఆస్పత్రి అంచనాకు వచ్చిన నేపథ్యంలో హైకోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది. ఈ వెంటిలేటర్లను ఇప్పటికే పలు మార్లు రిపేర్ చేయాల్సి వచ్చిందని జస్టిస్ రవీందర్ ఘుజె, జస్టిస్ బీయూ దెబాద్వార్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. వెంటిలేటర్లతో ఇలా ప్రయోగాలు చేయడాన్ని అనుమతించలేమని న్యాయమూర్తులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇలాంటి వాటి వల్ల పేషెంట్లు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. 


కాగా.. వైద్యుల బృందం ఒకటి ఈ వెంటిలేటర్ల పనితీరును పరీక్షించేందుకు ముంబైకి వెళుతుందని అదనపు సాలిసిటర్ జెనరల్ కోర్టుకు తెలపడంతో న్యాయస్థానం కేసు విచారణను జూన్ 7కు వాయిదా వేసింది. పీఎం కేర్స్ నిధులతో 150 వెంటిలేటర్లను కొనుగోలు చేసిన కేంద్రం వాటిని జీఎమ్‌సీహెచ్ ఆస్పత్రికి కేటాయించిన విషయం తెలిసిందే. వీటిని రాజ్‌కోట్‌కు చెందిన జ్యోతి సీఎన్‌సీ అనే సంస్థ తయారు చేసింది. అయితే..ఇవి తరచూ పాడవుతుండటాన్ని గుర్తించిన ఆస్పత్రి ముందుజాగ్రత్తగా వీటి వాడకాన్ని నిలిపివేసింది.  

Updated Date - 2021-06-04T00:21:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising