ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రాలకు 15 శాతం కోవిడ్ ఎమర్జెన్సీ ప్యాకేజీ నిధుల విడుదల

ABN, First Publish Date - 2021-08-01T00:32:25+05:30

ఆరోగ్య మౌలిక వసతులను మెరుగు పరచేందుకు కోవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఆరోగ్య మౌలిక వసతులను మెరుగు పరచేందుకు కోవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టం ప్రిపేర్డ్‌నెస్ (ఈసీఆర్‌పీ-2) ప్యాకేజీ కింద 15 శాతం నిధులను రాష్ట్రాలకు కేంద్రం విడుదల చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ శనివారంనాడు ఓ ట్వీట్‌లో ఈ విషయం తెలియజేశారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.1,827.8 కోట్లు విడుదల చేశామని, ఈ ప్యాకేజీ కింద కేటాయించిన మొత్తం రూ.12,185 కోట్లలో ఇది 15 శాతమని ఆయన తెలిపారు. కోవిడ్‌పై పోరాటంలో దేశం సాధికరత సాధించేందుకు ఈ ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా మరింత మేలైన ఆరోగ్య మౌలిక వసుతల కల్పనకు ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుందని అన్నారు.


కాగా, శనివారం ఉదయం 8 గంటల వరకూ గత 24 గంటల్లో దేశంలో 41,649 కరోనా కేసులు నమోదు కాగా, 593 మంది మృత్యువాత పడినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. యాక్టివ్ కేసులు వరుసగా నాలుగవ రోజు కూడా స్వల్పంగా పెరిగాయి. యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 4,08,920కి చేరుకుంది. వీటిలో మెజారిటీ కేసులు కేరళలో నమోదయ్యాయి. మొత్తం యాక్టివ్ కేసుల్లో 1.61 లక్షల కేసులు కేరళలో నమోదైనవే.

Updated Date - 2021-08-01T00:32:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising