ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మపై చర్యకు కేంద్రం సిఫారసు

ABN, First Publish Date - 2021-08-02T19:16:08+05:30

అధికార దుర్వినియోగానికి పాల్పడంతో పాటు సర్వీసు నిబంధనల ఉల్లంఘనల ఆరోపణలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అధికార దుర్వినియోగానికి పాల్పడంతో పాటు సర్వీసు నిబంధనల ఉల్లంఘనల ఆరోపణలు ఎదుర్కొంటున్న సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్‌వర్మపై చర్య తీసుకోవాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ)కి కేంద్రం సిఫారసు చేసింది. అలోక్‌వర్మపై సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా 2018లో చేసిన అవినీతి ఆరోపణలు సంచలనమయ్యాయి. ఈ నేపథ్యంలో అలోక్ వర్మపై చర్యలు ప్రారంభించాలని కేంద్ర హోం శాఖ (ఎంహెచ్ఏ), సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీఓపీటీ) తాజాగా ఆదేశాలిచ్చింది. పెగాసస్ 'స్పూప్ లిస్ట్'లో అలోక్‌వర్మ పేరు కూడా చోటుచేసుకోవడం విశేషం. వర్మ తన సర్వీసు కాలంలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించడాన్ని కూడా ప్రభుత్వం తన సిఫారసులలో ప్రస్తావించింది. వర్మ చర్యలకు గాను పెనాల్టీ విధించాలని సిఫారసు చేసింది. ఈ సిఫారసులను ఆమోదించినట్లయితే వర్మ పెన్షన్, రిటైర్‌మెంట్ అనంతర ప్రయోజనాలపై వేటు పడుతుంది.

Updated Date - 2021-08-02T19:16:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising