ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగు చట్టాల సవరణకు రెడీ... అయితే : తోమర్

ABN, First Publish Date - 2021-03-07T18:26:15+05:30

నూతన సాగు చట్టాలను సవరించడానికి తాము సిద్ధంగానే ఉన్నామని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. అయితే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : నూతన సాగు చట్టాలను సవరించడానికి తాము సిద్ధంగానే ఉన్నామని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. అయితే అవి లోపభూయిష్టంగా ఉన్నాయని మాత్రం ఎవరూ అనకూడదని, వాటికి జవాబులు చెప్పడానికి ఎవరూ సిద్ధంగా లేరని పేర్కొన్నారు. రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి పునరుద్ఘాటించారు. ‘‘చట్టాల సవరణల గురించి చర్చల సందర్భంలోనూ మాట్లాడాను. అయితే సవరణ అంటే అవి లోపభూయిష్టంగా ఉన్నయని అర్థం కాదనీ చెప్పా. నిరసన వ్యక్తం చేస్తున్నది రైతులు కాబట్టే ఈ అంశాన్ని ప్రతిపాదించా.’’ అని తోమర్ పేర్కొన్నారు. ప్రతిపక్షాలు కావాలనే ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. పార్లమెంట్‌లో కూడా తమ వాణిని వినిపించామని, చట్టాలపై స్పష్టత నిచ్చామని ఆయన తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత కూడా ప్రతిపక్షాలు కేవలం రైతు నిరసనల గురించి మాత్రమే మాట్లాడాయి కానీ, సాగు చట్టాల గురించి ఊసైనా ఎత్తలేదని విమర్శించారు. ఎప్పుడూ నూతన సాగు చట్టాల గురించే మాట్లాడేవారు కానీ, వారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, వ్యతిరేకించే అంశాల గురించి కూలంకషంగా మాట్లాడలేదని, ఇది ఎంతో బాధాకరమని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయం చేసే హక్కు అందరికీ ఉందని, అయితే రైతులను, ఆర్థిక  వ్యవస్థలను నష్టం చేసేవిధంగా ఉండకూడదని తోమర్ సూచించారు. 

Updated Date - 2021-03-07T18:26:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising