ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రంపై గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2021-10-19T01:23:41+05:30

సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుపుతున్న రైతులకు అనుకూలంగా మేఘాలయ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్: సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుపుతున్న రైతులకు అనుకూలంగా మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరసనలు సాగిస్తున్న రైతుల డిమాండ్లను పరిష్కరించాలని కేంద్రానికి సూచించారు. ''రైతు డిమాండ్లను నెరవేర్చని పక్షంలో ఈ ప్రభుత్వం (బీజేపీ) మళ్లీ అధికారంలోకి రాలేదు'' అని అన్నారు. రాజస్థాన్‌లో ఝుంఝును జిల్లాలో సోమవారంనాడు ఒక కార్యక్రమానికి వచ్చిన సత్యపాల్ మాలిక్ మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికలకు సిద్ధమవుతున్న ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని గ్రామాల్లోకి బీజేపీ నాయకులు అడుగుపెట్టలేకపోతున్నారని చెప్పారు. ''నేను మీరట్‌కు చెందిన వాడిని. నా ప్రాంతంలోని ఏ గ్రామంలోకి కూడా బీజేపీ నేతలు అడుగుపెట్టలేక పోతున్నారు. మీరట్‌, ముజఫర్‌నగర్‌, బాఘ్‌పట్‌లో ఈ పరిస్థితి ఉంది'' అని ఆయన తెలిపారు. సత్యపాల్ మాలిక్ జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్‌గా కూడా పనిచేశారు.


అవసరమైతే ఆ పని చేస్తా...

రైతులకు దన్నుగా నిలబడేందుకు మీ పదవిని వదులుకుంటారా అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, రైతులకు తాను అండగా ఉంటానన్నారు. పదవిని వదులుకోవాల్సిన అవసరం లేదని, అవసరమైతే ఆ పని చేస్తానని తెలిపారు. రైతు నిరసనల విషయంలో తాను అనేక మందితో గట్టిగా వాదించానని సత్యపాల్ మాలిక్ తెలిపారు. ''వారిలో, ప్రధాని, హోం మంత్రి సహా ప్రతి ఒక్కరూ ఉన్నారు. మీరు చేస్తున్నది తప్పు, ఇలా చేయండని చెప్పా'' అని వివరించారు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కి చటబద్ధమైన హామీ కల్పిస్తే సమస్య పరిష్కారమవుతుందని, మూడు బిల్లులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చినందున రైతులు ఈ అంశాన్ని ప్రస్తుతానికి వదులుకునే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. ''ఒకే ఒక్క విషయం ఉంది. అది కూడా మీరు చేయడం లేదు. ఎందుచేత? ఎంఎస్‌పీని పరిష్కరించకుండా ఏదీ పరిష్కరించలేం'' అని మాలిక్ కేంద్రాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.


కోరితే మధ్యవర్తిత్వం..

ప్రభుత్వం కోరితే కేంద్రానికి, రైతులకు మధ్యవర్తిత్వం చేసేందుకు తాను సుముఖంగా ఉన్నట్టు ఆయన చెప్పారు. ఎంఎస్‌పీ విషయాన్ని కేంద్రం పరిష్కరిస్తే, ఎంఎస్‌పీపై గ్యారెంటీ ఇస్తే, ప్రస్తుతానికి మూడు సాగు చట్టాల విషయాన్ని విడిచిపెట్టాలని రైతులను తాను కోరుతానని చెప్పారు. గతంలో కూడా సత్యపాల్ పాలిక్ రైతులకు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. రైతులను అవమానించ వద్దని, సంక్షోభాన్ని పరిష్కారించాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-10-19T01:23:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising