ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కలకలం.. పంజాబ్, మహారాష్ట్రకు కేంద్ర బృందాలు!

ABN, First Publish Date - 2021-03-06T22:52:30+05:30

పంజాబ్, మహారాష్ట్రలో రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. అక్కడి పరిస్థితిని సమీక్షించేందుకు నిపుణుల బృందాలను రంగంలోకి దింపింది. ఈ మేరకు కేంద్రం ఓ కీలక ప్రకటన చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పంజాబ్, మహారాష్ట్రలో రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. అక్కడి పరిస్థితిని సమీక్షించేందుకు నిపుణుల బృందాలను రంగంలోకి దింపింది. ఈ మేరకు కేంద్రం ఓ కీలక ప్రకటన చేసింది. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో కేంద్ర బృందాలు రాష్ట్ర అధికారులకు సహకరించనున్నాయి. మహారాష్ట్రలో పర్యటించనున్న బృందానికి కేంద్ర ఆరోగ్య శాఖ కీలక అధికారి పీ. రవీంద్రన్ నేతృత్వం వహించనున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ ఎస్‌కే సింగ్ పంజాబ్‌లోని బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. ఇక తాజా లెక్కల ప్రకారం.. పంజాబ్‌లో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 6661గా ఉంది. మహారాష్ట్రలో 90 వేల పైచిలుకు యాక్టివ్ కేసులు ఉన్నాయి.


ఈ బృందాలు తొలుత రెండు రాష్ట్రాల్లోని కరోనా హాట్‌స్పాట్‌లల్లో పర్యటించి పరిస్థితిని బేరీజు వేస్తాయి. ఈ వివరాలను కేంద్రానికి నివేదిస్తాయి. కరోనా కట్టడికి కోసం తీసుకోవాల్సిన చర్యలను కూడా సూచిస్తాయి. ఈ నివేదికను రాష్ట్ర అధికారులతో కూడా పంచుకుంటాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో తరచూ నిపుణులు బృందాలని ఆయా రాష్ట్రాలకు పరిశీలన కోసం పంపిస్తోంది. తద్వారా.. కరోనా కట్టడిలో ఎదురువుతున్న సవాళ్లు ఏమిటనేది తెలుసుకోవడంతో పాటూ నిపుణుల సాయంతో తగు పరిష్కారాలను కూడా సూచిస్తోంది. 

Updated Date - 2021-03-06T22:52:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising