ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గిస్తాం : కేంద్ర మంత్రి

ABN, First Publish Date - 2021-03-07T17:02:57+05:30

పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించేందుకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై/పెరంబూర్‌ : పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించేందుకు చర్యలు చేపడతామని, వీటిని జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై కూడా చర్చిస్తున్నట్టు కేంద్ర రహదారులశాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ తెలిపారు. మదురైలో రామ జన్మభూమి తీర్థక్షేత్రం ఆధ్వర్యంలో రామ రథయాత్రను ప్రారంభించిన మంత్రి మాట్లాడుతూ.. అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని దేశ ప్రజలందరూ స్వాగతిస్తున్నారని, పిల్లల నుంచి పెద్దల వరకు నిధులు అందజేస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయంగా ముడిచమురుల ధరలను బట్టి పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో మార్పు చోటుచేసుకోవడం సహజమేనన్నారు. ప్రస్తుతం వీటి ధరల పెంపు ప్రజలను బాధించేలా వుందన్నారు తమిళనాడు అభివృద్ధికి పాటుపడేది తమ ప్రభుత్వమేనని, అందువల్ల అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-03-07T17:02:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising