ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చట్టం అమలుతో 80 శాతం ట్రిపుల్ తలాక్ కేసులు తగ్గాయి: నఖ్వి

ABN, First Publish Date - 2021-08-01T22:04:29+05:30

ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) చట్టం అమలుతో అప్పటికప్పుడు ట్రిపుల్ తలాక్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) చట్టం అమలుతో అప్పటికప్పుడు ట్రిపుల్ తలాక్ చెప్పే కేసులు 80 శాతం తగ్గినట్టు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి అన్నారు. ట్రిపుల్ తలాక్ చట్టం అమల్లోకి వచ్చి రెండేళ్లయిన సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలో నఖ్వి మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారని అన్నారు.


''అయోధ్యలో రామాలయ అంశం పరిష్కారమైంది. జమ్మూకశ్మీర్ ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా 370వ అధికరణను రద్దు చేశారు. మహ్రం లేకుండా 3,5000 మంది ముస్లిం మహిళలు హజ్ యాత్ర చేశారు'' అని నఖ్వి తెలిపారు. 2019 ఆగస్టు 1న ముస్లిం మహిళా పరిరక్షణ చట్టం చేసినప్పటి నుంచి ఇన్‌స్టంట్ తలాక్ కేసులు 80 శాతం వరకూ తగ్గాయని చెప్పారు. ఈ చట్టం తేవడానికి ముందు ఉత్తరప్రదేశ్‌లో 63,000కు పైగా కేసులు నమోదు కాగా, చట్టం తెచ్చిన తర్వాత ఆ తరహా కేసులో 221కు తగ్గిపోయాయని తెలిపారు. బీహార్‌లో 49 కేసులు మాత్రమే నమోదయ్యాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, భూపిందర్ యాదవ్ కూడా పాల్గొన్నారు.

Updated Date - 2021-08-01T22:04:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising