ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏడు ప్రత్యేక రైళ్ల రద్దు

ABN, First Publish Date - 2021-05-17T14:28:11+05:30

ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఏడు ప్రత్యేక రైళ్లు రద్దయ్యాయి. ఈ మేరకు దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై/పెరంబూర్‌: ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఏడు ప్రత్యేక రైళ్లు రద్దయ్యాయి. ఈ మేరకు దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో,  చెన్నై ఎగ్మూర్‌- మన్నార్‌గుడి (నెం.06179), కన్నూర్‌- కోయం బత్తూర్‌ (నెం.06607), కోయంబత్తూర్‌-కన్నూర్‌ (నెం.06608), అళప్పుల- కన్నూర్‌ (నెం.06307), కన్నూర్‌-అళప్పుల (నెం.06308), ఎగ్మూర్‌-తిరుచ్చి (నెం.06795), తిరుచ్చి- ఎగ్మూర్‌ (నెం.06796) ప్రత్యేక డైలీ రైళ్లను సోమ వారం నుంచి ఈ నెల 31వ తేది వరకు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.


నేటినుంచి సబర్బన్‌ వర్క్‌మెన్‌ స్పెషల్స్‌ తగ్గింపు

నగరంలో నాలుగు మార్గాల్లో నడుపుతున్న సబర్బన్‌ వర్కమెన్‌ స్పెషల్‌ రైళ్ల రాకపోకలు సోమవారం నుంచితగ్గించారు. ఈ మేరకు దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో, కరోనా రెండవ దశ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నెల 10 నుంచి రెండు వారాలు సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు, అత్యవసరపు పనులకు వెళ్లే వారి కోసం ప్రత్యేక సబర్బన్‌ వర్క్‌మెన్‌ రైళ్లు నడుపు తున్నామని, సోమవారం నుంచి ఈ రైళ్లను తగ్గిస్తున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది. ఆ ప్రకారం...


మూర్‌ మార్కెట్‌ కాంప్లెక్స్‌-ఆవడి-తిరువళ్లూర్‌-అర క్కోణం-తిరుత్తణి - 42 సర్వీసులు

రుత్తణి-అరక్కోణం-తిరువళ్లూర్‌-ఆవడి-మూర్‌మార్కెట్‌ కాంప్లెక్స్‌ - 43 సర్వీసులు

మూర్‌మార్కెట్‌ కాంప్లెక్‌-గుమ్మిడిపూండి- సూళ్లూరుపేట - 15 సర్వీసులు

సూళ్లూరుపేట-గుమ్మిడిపూండి-మూర్‌మార్కెట్‌ కాంప్లెక్స్‌ - 15 సర్వీసులు

చెన్నై బీచ్‌-వేళచ్చేరి - 12 సర్వీసులు

వేళచ్చేరి-చెన్నై బీచ్‌ - 12 సర్వీసులు

చెన్నై బీచ్‌-తాంబరం-చెంగల్పట్టు-తిరుమాల్‌పూర్‌ - 33 సర్వీసులు

తిరుమాల్‌పూర్‌-చెంగల్పట్టు-తాంబరం- చెన్నై బీచ్‌ - 33 సర్వీసులు

తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు సోమవారం నుంచి శనివారం వరకు తగ్గించిన సర్వీసులుంటాయని దక్షిణ రైల్వే తెలియజేసింది.

Updated Date - 2021-05-17T14:28:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising