ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత విమానాలపై కెనడా నిషేధం మరోసారి పొడిగింపు

ABN, First Publish Date - 2021-08-11T01:01:29+05:30

భారత విమానాలపై ఆంక్షలనుకెనడా మరోసారి పొడిగించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒట్టావా : భారత విమానాలపై ఆంక్షలనుకెనడా మరోసారి పొడిగించింది. ఈ క్రమంలో... సెప్టెంబరు 21 వరకు భారత్ విమానాలపై నిషేధాన్ని పొడగించినట్లు కెనడా ప్రభుత్వం వెల్లడించింది. కరోనా వైరస్ నేపధ్యంలో... విమానప్రయాణాలపై ఆంక్షలు అమలవుతున్న విషయం తెలిసిందే. డెల్టా వేరియంట్ విజృంభణ నేపధ్యంలో ఏప్రిల్ 22 న భారత్ నుంచి నేరుగా వచ్చే విమానాలపై కెనడా నిషేధం  విధించింది. వాణిజ్య, ప్రైవేట్ ప్యాసింజర్ విమానాలపై నిషేధం విధిస్తుండగా, కార్గో, వైద్య సామాగ్రి రవాణా, మిలటరీ విమానాలకు మాత్రం మినహాయింపునిచ్చింది.


ఇక...  ఎపిడెమియోలాజికల్‌ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు కెనడా ప్రభుత్వం పేర్కొంది. పరిస్థితులు అనుకూలించిన వెంటనే విమాన సర్వీసులను పునప్రారంభించేందుకు భారత ప్రభుత్వం, విమానయాన సంస్థలతో కలిసి పని చేస్తుందని ఫెడరల్‌ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా... కెనడాకు నేరుగా భారత్‌ నుంచి కాకుండా మరో దేశం నుంచి వచ్చే ప్రయాణికులకు మాత్రం  అనుమతినిచ్చింది. పూర్తిగా వ్యాక్సినేట్‌ అయిన వారికి అనుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

Updated Date - 2021-08-11T01:01:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising