ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికల ఏడాదిలో ప్రచార ఖర్చే కీలకం!

ABN, First Publish Date - 2021-05-15T07:24:12+05:30

రాష్ట్రాల్లో కొనసాగుతున్న ప్రభుత్వాలకు.. ఎన్నికల సంవత్సరంలో ప్రచా రం కోసం ఎంత ఎక్కువ ఖర్చుపెడితే అంత ప్రయోజనం కలుగుతుందని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంత ఎక్కువ పెడితే ప్రభుత్వాలకు అంత లాభం!!

మళ్లీ గెలిచేందుకు అదే ముఖ్యం

కేరళ, బెంగాలే తాజా నిదర్శనం

ఎస్‌బీఐ ఆర్థివేత్తల నివేదిక


ముంబై, మే 14: రాష్ట్రాల్లో కొనసాగుతున్న ప్రభుత్వాలకు.. ఎన్నికల సంవత్సరంలో ప్రచా రం కోసం ఎంత ఎక్కువ ఖర్చుపెడితే అంత ప్రయోజనం కలుగుతుందని.. అడ్వర్టయిజ్‌మెంట్లపై అవి చేసే వ్యయం.. అధికారం నిలబెట్టుకోవడానిరి తోడ్పడుతుందని ఎస్‌బీఐకి చెందిన ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు వారి అభిప్రాయాలతో కూడిన నివేదిక శుక్రవారం విడుదలైంది. గత ఐదేళ్లలో 23 రాష్ట్రాల్లో చేసిన అధ్యయ న వివరాలను అందులో పేర్కొన్నారు. ‘ఎన్నికల ఏడాదిలో పబ్లిసిటీపై తక్కువ ఖర్చు చేసిన ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల్లో అధికా రం కోల్పోయాయి. ఓట్ల శాతం పెరగడం, మహిళా ఓటర్ల సం ఖ్య, కులాల ప్రాతిపదికన ఓటింగ్‌ శాతం పెరుగుదల, నాయకత్వం, ప్రభుత్వంపై వ్యతిరేకత వంటి ఇతర కారణాలు గెలుపోటములను ప్రభావితం చేసేవే అయినప్పటికీ.. ఎన్నికల సంవత్సరంలో పబ్లిసిటీపై ఎక్కువ ఖర్చుపెట్టిన ప్రభుత్వాలు పది రాష్ట్రా ల్లో అధికారాన్ని నిలబెట్టుకున్నాయి. ఇక్కడ పబ్లిసిటీ లేదా అడ్డర్టయిజింగ్‌ అంటే.. రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి గురించిన ప్రకటనలు లేదా మార్కెటింగ్‌ కమ్యూనికేషన్‌. రాజకీయాంశాలు, ప్రజాప్రయోజన అం శాలపైన, ప్రభుత్వ విధానాలపైన ఎన్నికల ప్రకటనటు ఇవ్వడం. పబ్లిసిటీపై కేరళలో 47 శాతం, పశ్చిమబెంగాల్లో 8 శాతం అత్యధికంగా ఖర్చుపెట్టడం వల్లే ఇటీవల అక్కడి సీఎంలు పినరయి విజయన్‌, మమతా బెనర్జీ తిరిగి అధికారం నిలబెట్టుకోగలిగారు. 


తమిళనాడులో కేవలం రెండు శాతం మాత్రమే ప్రచారంపై ఎక్కువ ఖర్చుపెట్టడంతో అన్నాడీఎంకే ప్రభుత్వం మళ్లీ విజయం సాధించలేకపోయింది’ అని నివేదికలోవిశ్లేషించారు. ఎన్నికల ఫలితాలను మహిళలు ఏ మాత్రం ప్రభావితం చేయగలిగారో తెలుసుకునేందుకు ఆయా ఆర్థికవేత్త లు ఆయా రాష్ట్రాల బడ్జెట్‌ పత్రాలను అధ్యయనం చేశారు. ‘గతంలో కంటే ఇప్పుడు మహిళా ఓటర్లు ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మేం పరిశీలించిన 23 రాష్ట్రాలకు గాను 15 రాష్ట్రా ల్లో పురుష ఓటర్లతో పోల్చితే మహిళా ఓటర్లు ఒక శాతం కంటే ఎక్కువగా ఓటింగ్‌లో పాల్గొన్నారు.  ఈ కారణంగానే ఈ 18 రా ష్ట్రాల్లో పది ప్రభుత్వాలు మళ్లీ అధికారంలోకి వచ్చాయి. భారత ప్రజాస్వామ్యంలో ఇదో గుణాత్మక మార్పు’ అని పేర్కొన్నారు.  

Updated Date - 2021-05-15T07:24:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising