ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.11,040 కోట్లతో జాతీయ మిషన్‌గా పామాయిల్ సేద్యం

ABN, First Publish Date - 2021-08-19T01:36:14+05:30

రాబోయే ఐదేళ్లలో పామాయిల్ సేద్యాన్ని వృద్ధి చేసేందుకు రూ.11,041 కోట్లతో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ ఫామ్ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రాబోయే ఐదేళ్లలో పామాయిల్ సేద్యాన్ని వృద్ధి చేసేందుకు రూ.11,041 కోట్లతో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ ఫామ్ (ఎన్ఎంఈఓ-ఓపీ)కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. తద్వారా వంటనూనెల దిగుమతలపై దేశం ఆధారపడటాన్ని తగ్గించాలని నిర్ణయించింది. ఆగస్టు 15న ఎర్రకోట నుంచి ఈ కొత్త పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నేపథ్యంలో క్యాబినెట్ తాజా నిర్ణయం తీసుకుంది. ఈశాన్య ప్రాంతాలు, అండమాన్ నికోబార్ ఐలాండ్స్‌ను ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని ఎన్ఎంఈఓ-ఓపీకి మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ బుధవారంనాడు మీడియాకు తెలిపారు. వంటనూనెల దిగుమతిపై ఎక్కువగా ఆధారపడుతున్నందున దేశీయంగా ఆయిల్ ఉత్పత్తులను పెంచాల్సి ఉంటుందని, సాగు విస్తీర్ణం పెంచడం, ఉత్పత్తి పెంచడం ఇందులో కీలకమవుతాయని చెప్పారు. ఈ స్కీమ్ కింద ప్రభుత్వం ఆయిల్ పామ్ పెంపకందారులకు ధర హామీని ప్రభుత్వం ఇస్తుందన్నారు. ప్లాంటింగ్ మెటీరియల్ కోసం హెక్టారుకు ఇచ్చే రూ.12,000 సాయాన్ని రూ.29,000కు రెట్టింపు చేస్తామని తోమర్ తెలిపారు.

Updated Date - 2021-08-19T01:36:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising