ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CAB డ్రైవర్లకు తాలిబన్ల హెచ్చరిక

ABN, First Publish Date - 2021-11-08T01:23:48+05:30

తూర్పు నంగర్హార్ ప్రావిన్స్‌లోని ట్యాక్సీ డ్రైవర్లకు తాలిబన్లు సరికొత్త ఆదేశాలు జారీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాబూల్: తూర్పు నంగర్హార్ ప్రావిన్స్‌లోని ట్యాక్సీ డ్రైవర్లకు తాలిబన్లు సరికొత్త ఆదేశాలు జారీ చేశారు. తాలిబన్ అనుబంధ సంస్థలకు చెందిన  సాయుధులను తప్ప మిగతా ఎవరినీ తమ వాహనాల్లో ఎక్కించుకోవద్దని ఆదేశించారు. ఈ మేరకు నంగర్హార్ ప్రావిన్షియల్ కార్యాలయం పేర్కొంది.


ప్రావిన్స్ రక్షణ కోసం నలుమూలలా ఉన్న డ్రైవర్లు ఈ విషయంలో తమతో చేతులు కలపాలని కోరింది. సాయుధులైన ఇతరులను రవాణా చేయకుండా అడ్డుకోవాలని సూచించింది. టాక్సీలలో ఎవరైనా అనుమానిత సాయుధుడు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పేర్కొంది.


దేశంలోని తూర్పు ప్రావిన్స్‌లో ఐసిస్-కె ఉగ్రవాదులు చెలరేగిపోతూ ఆత్మాహుతి దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. అయితే, ఈ సందర్భంగా ఏ సంస్థ పేరును ప్రభుత్వం ప్రస్తావించలేదు.  

Updated Date - 2021-11-08T01:23:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising