ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఏఏను కూడా రద్దు చేయండి: జమాతే డిమాండ్

ABN, First Publish Date - 2021-11-21T00:43:33+05:30

సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో పౌరసత్వ సవరణ చట్టం, 2019 (సీఏఏ) అంశాన్ని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో పౌరసత్వ సవరణ చట్టం, 2019 (సీఏఏ) అంశాన్ని సైతం పలువురు లేవెనెత్తుతుండటం కనిపిస్తోంది. తాజాగా జమాత్ ఉలేమా-ఇ-హింద్ సంస్థ కూడా స్పందించింది. సాగు చట్టాలపై ప్రధాని ప్రకటనను స్వాగతిస్తున్నామని జమాత్ చీఫ్ మౌలానా సైయద్ అర్షద్ మదాని అన్నారు. ఇదే సమయంలో, సీఏఏ చ్టటాన్ని కూడా ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సాగు చట్టాల ఉపసంహరణ నిర్ణయం మన ప్రజాస్వామ్యం, ప్రజల శక్తి సర్వోన్నతమైనవనే విషయాన్ని చాటుతోందని అన్నారు.


దేశంలోని ఇతర ఆందోళనల తరహాలోనే రైతు ఉద్యమాన్ని అణచివేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరిగాయని మదాని ఆరోపించారు. రైతులను విడదీసే కుట్ర జరిగిందని, అయితే రైతులు అన్నిరకాల త్యాగాలకు రైతులు సిద్ధమై, ఏమాత్రం వెనుకంజ వేయకుండా తమ ఉద్యమాన్ని కొనసాగించారని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చోటుచేసుకున్న ఆందోళనలే సాగుచట్టాలపై నిరసనలకు రైతులకు ప్రేరణగా నిలిచినట్టు ఆయన చెప్పారు. సాగు చట్టాల తరహాలోనే సీఏఏను కూడా రద్దు చేయాలని మదాని డిమాండ్ చేశారు.

Updated Date - 2021-11-21T00:43:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising