ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉప ఎన్నికలు : హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ హవా

ABN, First Publish Date - 2021-11-02T20:54:21+05:30

హిమాచల్ ప్రదేశ్‌లో అక్టోబరు 30న జరిగిన లోక్‌సభ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్‌లో అక్టోబరు 30న జరిగిన లోక్‌సభ, శాసన సభ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యత ప్రదర్శిస్తోంది. మండి లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి ప్రతిభ సింగ్ తన సమీప ప్రత్యర్ధి, బీజేపీ అభ్యర్థి బ్రిగేడియర్ (రిటైర్డ్) ఖుషల్ ఠాకూర్ కన్నా ముందంజలో ఉన్నారు. 


ఈ రాష్ట్రంలోని మూడు శాసన సభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఫతేపూర్, జుబ్బల్-కొట్‌ఖాయ్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. అర్కి శాసన సభ నియోజకవర్గంలో కూడా గెలుపుదిశగా కాంగ్రెస్ పయనిస్తోంది. ఇక్కడి నుంచి సంజయ్ తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి రతన్ సింగ్ పాల్‌పై 2 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.


మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ సతీమణి ప్రతిభా సింగ్ మండి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికల బరిలో నిలిచారు. 


Updated Date - 2021-11-02T20:54:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising