ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భవన వ్యర్థాల నుంచి కంకర, ఇసుక తయారీ

ABN, First Publish Date - 2021-10-13T14:44:42+05:30

నగరంలో కొడుంగయూరు, పెరుంగుడి ప్రాంతాల్లో భవన వ్యర్థాల నుంచి కంకర, రెండు రకాలైన ఇసుకను తయారు చేసే పథకాన్ని రాష్ట్ర మంత్రులు కేఎన్‌ నెహ్రూ, పీకే శేఖర్‌ బాబు, ఎం.సుబ్ర మణ్యం మంగళవారం ఉదయం ప్రారంభించా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                - ప్రారంభించిన మంత్రులు


చెన్నై: నగరంలో కొడుంగయూరు, పెరుంగుడి ప్రాంతాల్లో భవన వ్యర్థాల నుంచి కంకర, రెండు రకాలైన ఇసుకను తయారు చేసే పథకాన్ని రాష్ట్ర మంత్రులు కేఎన్‌ నెహ్రూ, పీకే శేఖర్‌ బాబు, ఎం.సుబ్ర మణ్యం మంగళవారం ఉదయం ప్రారంభించారు. నగరంలో భవనాల వ్యర్థాలను తొలగించడం సమస్యగా మారడంతో వీటిని కొడుంగయూరు, పెరుంగుడి ప్రాంతాల్లోని డంపింగ్‌ యార్డులకు తరలిం చారు. టన్నుల కొద్దీ చెత్తకుప్పలను నిల్వచేసే ఆ ప్రాంతాలకు తరలించిన కట్టడ వ్యర్థాలను యంత్రాల ద్వారా రీసైక్లింగ్‌ పద్ధతిలో రెండు రకాల కంకరను, ఎంసాండ్‌ సహా మూడు రకాల ఇసుకను తయారు చేసే పథ కాన్ని గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ చేపట్టిం ది. మంగళవారం ఉదయం కొడుంగ యూరు, పెరుంగుడి వద్ద భారీ యంత్రాల ద్వారా కట్టడ వ్యర్థాలను క్రషింగ్‌ చేసే పనులను మంత్రులు నెహూ, శేఖర్‌బాబు, సుబ్రమణ్యం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌ గగన్‌దీప్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ నగరంలో ఇటీవల కాలంలో పాత భవనాలు కూల్చి కొత్తవి నిర్మించే పనులు అధికమయ్యాయని, దీంతో పాత భవనాల వ్యర్థాలను అడ్డూ అదుపూ లేకుండా రహదారులపై, నీటి వనరులున్న ప్రాంతాల వద్ద పారబోస్తున్నారని తెలిపారు. ఈ భవన వ్యర్థాలను ఒకే చోట పోగుచేసి వాటిని రీసైక్లింగ్‌ ద్వారా  కంకర, ఇసుకను తయారు చేయాలని కార్పొరేషన్‌ నిర్ణయించిందని చెప్పారు. భవన వ్యర్థాలను క్రషింగ్‌ చేసే కేంద్రాలను పెరుంగుడి, కొడుంగయూరులో ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పెరంబూరు శాసనసభ్యుడు ఆర్టీ శేఖర్‌ తదితరులు  పాల్గొన్నారు.

Updated Date - 2021-10-13T14:44:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising