ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర బలగాలతో ప్రజలను భయపెడుతున్నారు : తృణమూల్

ABN, First Publish Date - 2021-01-21T22:17:30+05:30

మున్సిపల్ మంత్రి ఫిర్హద్ హకీమ్ సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర బలగాలతో సరిహద్దు ప్రాంత ప్రజలను కేంద్రం భయపెట్టిపోస్తోందని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా : మున్సిపల్ మంత్రి ఫిర్హద్ హకీమ్ సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర బలగాలతో సరిహద్దు ప్రాంత ప్రజలను కేంద్రం భయపెట్టిపోస్తోందని మంత్రి ఫిర్హద్ హకీమ్ ఆరోపించారు. కేంద్ర బలగాలతో ప్రజలను భయపెడుతూ, తమకు ఓటేసెలా బీజేపీ యత్నిస్తోందని వ్యాఖ్యానించారు. మంత్రి హకీమ్ నేతృత్వంలో తృణమూల్ నేతల బృందం గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘంతో భేటీ అయ్యింది. భేటీ తర్వాత మంత్రి హకీమ్ మాట్లాడుతూ... ప్రజలను భయపెట్టి కేంద్ర బలగాలు బీజేపీకి ఓట్లు వేయించేలా వ్యూహం పన్నాయని, ఇదే విషయాన్ని తాము రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై ఈసీ స్పందిస్తూ... ఈ ఆరోపణలపై తప్పకుండా దృష్టి సారిస్తామని ప్రకటించారు. అయితే ఈ ఆరోపణలను బీఎస్‌ఎఫ్ ఖండించింది. తమకు రాజకీయాలతో సంబంధం లేదని బీఎస్‌ఎఫ్ స్పష్టం చేసింది. 

Updated Date - 2021-01-21T22:17:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising