ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ‘సూపర్ మ్యూటెంట్ వేరియంట్’ సోకితే ముగ్గురిలో ఒకరికి ప్రాణహాని: బ్రిటీష్ శాస్త్రవేత్తల హెచ్చరిక!

ABN, First Publish Date - 2021-08-01T15:27:20+05:30

ప్రపంచాన్ని కరోనా వైరస్ మరింతగా వణికిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: ప్రపంచాన్ని కరోనా వైరస్ మరింతగా వణికిస్తోంది. కరోనా వైరస్‌కు సంబంధించిన కొత్త వేరియంట్లు వివిధ దేశాల్లో మరింతగా విస్తరిస్తున్నాయి. ఈ నేపధ్యంలో బ్రిటీష్ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా మరో కొత్త విషయాన్ని కొనుగొని దానిని వెల్లడించారు. కరోనాకు సంబంధించిన సూపర్ మ్యూటెంట్ వేరియంట్ మరింత ప్రాణాంతకం కానున్నదని హెచ్చరించారు. దీని బారిన పడిన ముగ్గురులోని ఒకరికి ప్రాణహాని ఉండవచ్చన్నారు. లండన్‌లోని సైంటిఫిక్ ఎడ్వైజరీ గ్రూప్ ఫర్ ఎమర్జెన్సీకి చెందిన శాస్త్రవేత్తలు తాము చేసిన పరిశోధనల రిపోర్టును వెలువరించారు. 


రాబోయే కరోనా వేరియంట్ మరింత ప్రమాదకరం కానున్నదని ఆ రిపోర్టులో పేర్కొన్నారు. ముఖ్యంగా జంతువుల నుంచి కరోనా కొత్త వేరియంట్ వ్యాపించనున్నదని, అందుకే అటువంటి జంతువులను వధించాలని లేదా వాటికి వ్యాక్సిన్ వేయాలని సూచించారు. అప్పుడే కొత్త వేరియంట్ రాకుండా అడ్డుకోగలమని ఆ నివేదికలో వివరించారు. ఈ కొత్త వేరియంట్ వివిధ వేరియంట్ల కలయికతో ఏర్పడవచ్చన్నారు. దీనిపై కోవిడ్-19 వ్యాక్సీన్ ప్రభావం ఉండకపోవచ్చన్నారు. 

Updated Date - 2021-08-01T15:27:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising