ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో బ్రిటన్‌ వేరియంట్‌ ఉధృతి

ABN, First Publish Date - 2021-05-07T08:04:48+05:30

గత నెలన్నర రోజులుగా దేశంలో బ్రిటన్‌ కరోనా వేరియంట్‌ (బి.1.1.7) వ్యాప్తి గణనీయంగా తగ్గుముఖం పట్టిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఎన్‌సీడీసీ) డైరెక్టర్‌ సుజీత్‌ సింగ్‌ వెల్లడించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 162 నమూనాల జీనోమ్‌ సీక్వెన్సింగ్‌లో గుర్తింపు 
  • మహారాష్ట్ర, బెంగాల్‌లలో డబుల్‌ మ్యుటెంట్‌ ప్రాబల్యం : ఎన్‌సీడీసీ


న్యూఢిల్లీ, మే 6 : గత నెలన్నర రోజులుగా దేశంలో బ్రిటన్‌ కరోనా వేరియంట్‌ (బి.1.1.7) వ్యాప్తి గణనీయంగా తగ్గుముఖం పట్టిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఎన్‌సీడీసీ) డైరెక్టర్‌ సుజీత్‌ సింగ్‌ వెల్లడించారు.  తెలంగాణ నుంచి సేకరించిన 192  నమూనాల(శాంపిళ్ల)లో, ఢిల్లీ (516), పంజాబ్‌ (482), మహారాష్ట్ర (83), కర్ణాటకకు చెందిన 82 మంది శాంపిళ్లలో బ్రిటన్‌ వేరియంట్‌ను గుర్తించినట్లు గురువారం ఆయన విలేకరుల సమావేశంలో చెప్పారు. డబుల్‌ మ్యుటెంట్‌ వేరియంట్‌ (బి.1.617)ను అత్యధికంగా మహారాష్ట్ర నుంచి సేకరించిన 761 శాంపిళ్లలో, పశ్చిమ బెంగాల్‌ (124), ఢిల్లీ (107), గుజరాత్‌కు చెందిన 102 మంది శాంపిళ్లలో గుర్తించామన్నారు. దక్షిణాఫ్రికా వేరియంట్‌ (బి.1.315) కేసులు తెలంగాణ, ఢిల్లీలలో ఎక్కువగా ఉన్నాయన్నారు. బ్రెజిల్‌ వేరియంట్‌ కేసులు ఒక్క మహారాష్ట్రలోనే వెలుగుచూశాయని, అవి చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నట్లు చెప్పారు. 10 కేంద్ర ప్రభుత్వ లేబొరేటరీల్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి సేకరించిన 18,053 శాంపిళ్ల జన్యుక్రమాలను విశ్లేషించినట్లు తెలిపారు. 


Updated Date - 2021-05-07T08:04:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising