ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సురక్షితం : బ్రిటన్ ప్రధాని జాన్సన్

ABN, First Publish Date - 2021-03-16T22:53:01+05:30

ఆస్ట్రాజెనెకా కరోనా వైరస్ వ్యాక్సిన్ సురక్షితమైనదేనని బ్రిటన్ ప్రధాన మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్ : ఆస్ట్రాజెనెకా కరోనా వైరస్ వ్యాక్సిన్ సురక్షితమైనదేనని బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ చెప్పారు. ఈ వ్యాక్సిన్ చాలా బాగా పని చేస్తోందన్నారు. దీనిని అనేక దేశాల్లో తయారు చేసి, ఉపయోగిస్తున్నారని తెలిపారు. కొన్ని యూరోపియన్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో జాన్సన్ ఆస్ట్రాజెనెకాకు అండగా నిలిచారు. 


ఆస్ట్రాజెనెకా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారి రక్తం గడ్డ కడుతున్నట్లు ఆందోళన వ్యక్తమవడంతో జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ వంటి దేశాలు ఈ వ్యాక్సిన్‌ను సస్పెండ్ చేశాయి. దీంతో 26 లక్షల మందిని పొట్టనబెట్టుకున్న కోవిడ్-19 మహమ్మారిపై పోరాటానికి ఆటంకం ఏర్పడింది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆస్ట్రాజెనెకా, యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ ఈ వ్యాక్సిన్ సురక్షితమైనదేనని ప్రకటించాయి. రక్తం గడ్డ కడుతున్న సంఘటనలకు, ఈ వ్యాక్సిన్‌కు సంబంధం లేదని తెలిపాయి. 


ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఓ వార్తా పత్రికలో రాసిన వ్యాసంలో ‘‘ఈ వ్యాక్సిన్ సురక్షితమైనది, చాలా బాగా పని చేస్తోంది’’ అని పేర్కొన్నారు. ‘‘ఇది భారత దేశం నుంచి అమెరికా వరకు, బ్రిటన్‌తో సహా అనేక చోట్ల తయారవుతోంది, దీనిని ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు’’ అని తెలిపారు. 


ఆస్ట్రాజెనెకా, బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాయి. మన దేశంలో దీనిని కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ అని పిలుస్తున్నారు. కోవిషీల్డ్‌ను పుణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్ తయారు చేస్తోంది. 


Updated Date - 2021-03-16T22:53:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising