ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్ బయోటెక్ టీకాకు నో చెప్పిన బ్రెజిల్!

ABN, First Publish Date - 2021-04-01T01:29:55+05:30

భారత్ బయోటెక్ తయారు చేసిన కొవ్యాక్సిన్ టీకాను దిగుమతి చేసుకోమంటూ బ్రెజిల్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ తయారు చేసిన కొవ్యాక్సిన్ టీకాను దిగుమతి చేసుకోమంటూ బ్రెజిల్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. టీకా ఉత్పత్తికి సంబంధించిన పారిశ్రామిక నిబంధనలు భారత్ బయోటెక్ పాటించలేదని బ్రెజిల్ ప్రభుత్వం ఈ సందర్భంగా ప్రకటించింది. కరోనా కారణంగా అల్లాడిపోతున్న బ్రెజిల్ గతంలో రెండు మిలియన్ల కొవ్యాక్సిన్ టీకా డోసులను దిగుమతి చేసుకునేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే..ఈ పరిణామంపై భారత్ బయోటెక్ కూడా స్పందించింది. బ్రెజిల్ ప్రభుత్వం పేర్కొన్న నిబంధనలు అమలు చేస్తామని, ఎప్పట్లోగా ఈ పనిచేయాలన్న దానిపై చర్చలు జరుగుతున్నాయని పేర్కొంది. కొవ్యాక్సిన్ కరోనా టీకాకను భారత్ బయోటెక్, భారత వైద్య పరిశోధన మండలి సంయుక్తంగా అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఇటీవల పూర్తైన క్లినికల్ ట్రయల్స్‌లో టీకా ప్రభావశీలత 81 శాతంగా ఉన్నట్టు తేలింది. 

Updated Date - 2021-04-01T01:29:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising