ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్లల్ని కనాలన్న ప్రణాళికలను పక్కనపెట్టండి: బ్రెజిల్ ప్రభుత్వం

ABN, First Publish Date - 2021-04-18T00:08:31+05:30

ప్రజల జీవితాలను కరోనా సంక్షోభం ఎంతలా మార్చేసిందో..బ్రెజిల్ ప్రభుత్వం తాజా సూచన వింటే ఇట్టే అర్థమవుతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సావ్ పావొలో: ప్రజల జీవితాలను కరోనా సంక్షోభం ఎంతలా మార్చేసిందో..బ్రెజిల్ ప్రభుత్వం తాజా సూచన వింటే ఇట్టే అర్థమవుతుంది. కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకువస్తుండటంతో ఏం చేయాలో తెలియక ప్రపంచ దేశాలు తలపట్టుకుంటుంటున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లల్ని కనాలన్న ప్రయత్నాలను కొంత కాలం పాటు వాయిదా వేసుకోవాలని మహిళలకు బ్రెజిల్ ప్రభుత్వం సూచించింది. మునుపటి వైరస్‌తో పోలీస్తే కొత్త వేరియంట్లు గర్భవతులకు ఎక్కువగా సోకుతుండటమే ఇందుకు కారణం.  అంతేకాకుండా.. ఆరోగ్య వ్యవస్థలపై ఒత్తిడి ఎక్కువగా పడకుండా ఉండేందుకు కూడా ఇది అవసరమని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా పేర్కొంది. కరోనా తీవ్రత తగ్గే వరకూ ఈ ఆలోచనను తాత్కాలికంగా పక్కన పెట్టాల్సి స్పష్టం చేసింది. కరోనా కారణంగా అత్యధికంగా అల్లాడుతున్న దేశాల్లో బ్రెజిల్ రెండో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఆస్పత్రుల్లో బెడ్లు, ఔషధాల కొరత అక్కడి ప్రభుత్వాన్ని వేధిస్తుండటంతో సాయం చేయాలంటూ అంతర్జాతీయ సమాజానికి అక్కడి ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.

Updated Date - 2021-04-18T00:08:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising