ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tihar జైల్లోని 12 వేలమంది ఖైదీలపై కన్నేయడానికి...

ABN, First Publish Date - 2021-10-13T18:12:12+05:30

ఇకపై జైలులోని ఖైదీలపై మరింత నిఘా వేయాలని తీహార్ జైలు అధికారులు నిర్ణయించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఇకపై జైలులోని ఖైదీలపై మరింత నిఘా వేయాలని తీహార్ జైలు అధికారులు నిర్ణయించారు.దీనిలో భాగంగా ఢిల్లీలోని తీహార్ జైలులో జైలు అధికారుల కోసం 375 బాడీ కెమెరాలను కొనుగోలు చేశారు. తీహార్ జైలులో ఇప్పటికే 150 బాడీ వేర్ కెమెరాలున్నాయని, ఇప్పుడు అత్యంత అధునాతనమైన మరో 375 బాడీ కామ్ లను కొనుగోలు చేయడంతో జైలులో ఖైదీలపై నిఘా మరింత పెంచామని తీహార్ జైలు అధికారులు చెప్పారు.ప్రస్థుతం ఢిల్లీలోని 16 జైళ్లలో 18వేల మంది ఖైదీలున్నారు. 


ఒక్క తీహార్ జైలులోని మూడు కాంప్లెక్సుల్లో 12వేలమందికి పైగా ఖైదీలున్నారు. ఖైదీలపై మరింత నిఘా కోసం ప్రతీ వార్డులో రెండు మూడు కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు జైలు అధికారులు చెప్పారు. జైలు వార్డర్లకు బాడీవేర్ కెమెరాలు ఇస్తామని అధికారులు చెప్పారు.వార్డర్లకు ఇచ్చే బాడీవేర్ కెమెరాలు 7 గంటల బ్యాటరీ బ్యాకప్ తో అధిక రిజల్యూషన్ తో రికార్డింగ్ వ్యవస్థ ఉందని జైలు అధికారులు చెప్పారు.

Updated Date - 2021-10-13T18:12:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising