ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంబైలో కొత్త కొవిడ్ నిబంధనలు ఇవే..

ABN, First Publish Date - 2021-12-19T01:58:14+05:30

ఒమిక్రాన్ వేరియంట్ ముప్పు పెరుగుతుండడంతో బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ఒమిక్రాన్ వేరియంట్ ముప్పు పెరుగుతుండడంతో బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) శనివారం సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. క్రిస్మస్, కొత్త సంవత్సరం వేళ ప్రయాణాలు, అందరూ ఒకే చోట చేరే అవకాశం ఎక్కువగా ఉంది. 


ఫలితంగా వైరస్ వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉండడంతో వాటికి అడ్డుకట్ట వేసే చర్యలు చేపట్టింది. పండుగ సీజన్‌లో ప్రజలు పెద్దఎత్తున గుమికూడకుండా కొవిడ్ మార్గదర్శకాలను పాటించాలని సూచించింది. ఉల్లంఘిస్తే శిక్ష తప్పదని కూడా హెచ్చరికలు జారీ చేసింది.

 

 బీఎంసీ విడుదల చేసిన మార్గదర్శకాలు ఇవే..


 * కొవిడ్ మార్గదర్శకాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

 * వార్డు స్థాయిలో బృందాలను ఏర్పాటు చేస్తారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటారు.

 * మూసి ఉన్న ప్రాంతాల్లో 50 శాతం సామర్థ్యానికి మించి కార్యకలాపాలు నిర్వహించకూడదు.

* బహిరంగ ప్రదేశాల్లో 25 శాతం మించకూడదు.

* 1000 మందికి మించి కలుసుకోవాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి.

 * మాస్కులు తప్పకుండా ధరించాలి. రెండు వ్యాక్సిన్లు వేయించుకోవాలి

 

కరోనా తొలి, రెండో ఉద్ధృతితో విలవిల్లాడిన మహారాష్ట్రను ఇప్పుడు ఒమైక్రాన్ వేరియంట్ కూడా భయపెడుతోంది. దేశంలోనే అత్యధికంగా ఇక్కడ 40కిపైగా ఒమైక్రాన్ కేసులు నమోదయ్యాయి. క్రిస్మస్, న్యూ ఇయర్‌ను పురస్కరించుకుని ప్రభుత్వం తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది.

Updated Date - 2021-12-19T01:58:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising