ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ, ఎస్పీ, కాంగ్రెస్‌ పార్టీల రంగులు అవి: మాయావతి

ABN, First Publish Date - 2021-12-23T21:40:42+05:30

అయోధ్యలోని రామమందిరం వద్ద బీజేపీ నేతలు, ప్రభుత్వ అధికారులు భూములు కొన్నారన్న వార్తలపై మాయావతి తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘‘ఇది చాలా సీరియస్ అంశం. దీనిపై సుప్రీంకోర్టు కల్పించుకుని విచారణ చేయాలని మా పార్టీ కోరుతోంది. అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వంలోని ఒప్పందాలు అన్నీ రద్దు చేయాలి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లఖ్‌నవూ: తమ లోపాలను కప్పిపుచ్చుకోవడానికి హిందూ-ముస్లిం అంటూ మతం రంగులు పులుముకోవడంలో బిజీగా ఉన్నాయని భారతీయ జనతా పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలపై బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గడగడపకూ వెళ్లి ఈ రంగుల గుట్టు రట్టు చేయాలని ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల గురించి మీడియాతో మాట్లాడారు.


‘‘ఎన్నికల లబ్ది కోసమే బీజేపీ, ఎస్పీ, కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు తమ లోపాలను కప్పి పుచ్చుకోవడానికి హిందూ-ముస్లిం అనే రంగులు వేసే పనిలో బిజీగా ఉన్నాయి. వారికి ఇంతకు మించి వేరే దారి లేదు. ప్రజల కోసం ఏదైనా చేస్తే చెప్పేవారు. ప్రజలకు ఏమీ చేయలేదు కాబట్టే మతం రంగులు అద్దుకుంటున్నారు. బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన ప్రతి నేత, ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి ప్రతి ఇంటి తలుపు తట్టి ప్రజలను హెచ్చరిస్తారు. ఈ పని ఇప్పుడే ప్రారంభం కావాలి’’ అని మాయావతి అన్నారు.


ఇక అయోధ్యలోని రామమందిరం వద్ద బీజేపీ నేతలు, ప్రభుత్వ అధికారులు భూములు కొన్నారన్న వార్తలపై మాయావతి తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘‘ఇది చాలా సీరియస్ అంశం. దీనిపై సుప్రీంకోర్టు కల్పించుకుని విచారణ చేయాలని మా పార్టీ కోరుతోంది. అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వంలోని ఒప్పందాలు అన్నీ రద్దు చేయాలి’’ అని మాయావతి అన్నారు.

Updated Date - 2021-12-23T21:40:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising