ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నందిగ్రామ్‌ నుంచి సువేందు, 57 మందితో బీజేపీ జాబితా

ABN, First Publish Date - 2021-03-07T01:02:11+05:30

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే తొలి, రెండవ విడత అభ్యర్థుల...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే తొలి, రెండవ విడత అభ్యర్థుల జాబితాను బీజేపీ శనివారంనాడు విడుదల చేసింది. 57 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ విడుదల చేశారు. 291 అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల పూర్తి జాబితాను తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) శుక్రవారం విడుదల చేసిన నేపథ్యంలో బీజేపీ తాజా జాబితా విడుదల చేసింది. టీఎంసీపై ఇటీవల తిరుగుబాటు బావుటా ఎగురవేసి బీజేపీలో చేరిన సువేందు అధికారిని నందిగ్రామ్ నుంచి బీజేపీ పోటీలోకి దింపడం విశేషం. నంద్రిగ్రామ్ నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్నందున ఈ నియోజకవర్గంలో పోటీ మరింత రసవత్తరంగా మారింది. 8 విడతలుగా జరుగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 27న మొదలై ఏప్రిల్ 29న ముగుస్తాయి. మే 2న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.

Updated Date - 2021-03-07T01:02:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising