ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్ థర్డ్ వేవ్ రాకుండా ఉండాలంటే..: మంత్రి ఉషా ఠాకూర్

ABN, First Publish Date - 2021-05-12T20:03:08+05:30

మూఢనమ్మకాలపై అవగాహన కల్పించాల్సినవారే వాటిని పెంచి పోషిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మధ్యప్రదేశ్: మూఢనమ్మకాలపై అవగాహన కల్పించాల్సినవారే వాటిని పెంచి పోషిస్తున్నారు. మద్యప్రదేశ్ సాంస్కృతికశాఖ మంత్రి ఉషా ఠాకూర్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కోవిడ్ థర్డ్ వేవ్ రాకుండా ఉండాలంటే ప్రజలు యజ్ఞాలు చేయాలని సూచించారు. యజ్ఞ చికిత్స నాలుగు రోజులపాటు నిర్వహించాలన్నారు. దేశంలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ డేంజర్ బెల్స్ మోగిస్తోందన్నారు. రోజు రోజుకు రికార్డు స్థాయిలో పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయని, ఇది దేశంలోని ఆరోగ్య మౌలిక సదుపాయాలను అణచివేస్తోందని, ఫ్రంట్‌లైన్ వైద్య కార్మికులపై అధికభారం పడుతోందన్నారు. 


ఇండోర్‌లోని కోవిడ్ కేర్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి ఉషా ఠాకూర్ మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పర్యావరణ శుద్ధికరణ కోసం నాలుగు రోజులు యజ్ఞం చేయాలన్నారు. ఈ యజ్ఞ చికిత్సను మన పూర్వీకులు మహమ్మారిని వదిలించుకోవడానికి చేసేవారని చెప్పుకొచ్చారు. మనమందరం పర్యావరణాన్ని శుద్ధి చేసుకుందామని, కోవిడ్ థర్డ్ వేవ్ భారత దేశానికి రాకుండా కాపాడుకుందామని మంత్రి సలహా ఇచ్చారు. అంతకుముందు కరోనాను నిర్మూలించడానికి ఠాకూర్ ఇండోర్ విమానాశ్రయంలో ఒక విగ్రహం ముందు ఆమె ఖర్మలు చేశారు. 

Updated Date - 2021-05-12T20:03:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising