ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మమత బెనర్జీ ఇస్లామిక్ టెర్రరిస్ట్: బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2021-01-18T03:01:48+05:30

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పశ్చిమ బెంగాల్ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా బీజేపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పశ్చిమ బెంగాల్ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా బీజేపీ, అధికార టీఎంసీ మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బెంగాల్ కోటలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలగా ఉన్న బీజేపీ ఆ పార్టీ నాయకులను ఆకర్షిస్తూ ముఖ్యమంత్రి మమత బెనర్జీని ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా, బీజేపీని ఎట్టిపరిస్థితుల్లోనూ బెంగాల్‌లో అధికారానికి దూరంగా ఉంచాలని మమత ప్రయత్నిస్తున్నారు. దీంతో ఇరు పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగితేలుతున్నాయి.


మమతపై బీజేపీ అగ్ర నేతలు ఇటీవల వరుసగా విరుచుకుపడుతుండగా, తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత, పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి అనంద్ స్వరూప్ శుక్లా మమతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మమతను ఇస్లామిక్ ఉగ్రవాదిగా అభివర్ణించిన శుక్లా.. పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత ఆమె బంగ్లాదేశ్‌లో ఆశ్రయం పొందుతారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


‘‘మమత బెనర్జీ పూర్తిగా బంగ్లాదేశీయురాలే. ఆమె అక్కడి ఇస్లామిక్ ఉగ్రవాదుల మార్గదర్శకత్వంలో ఇక్కడ పనిచేస్తున్నారు. దేశానికి ఆమె అత్యంత ప్రమాదకారిగా తయారయ్యారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమె బంగ్లాదేశ్ ఆశ్రయం పొందేందుకు సిద్ధంగా ఉన్నారు’’ అని శుక్లా పేర్కొన్నారు. 

Updated Date - 2021-01-18T03:01:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising