ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెంగాల్‌లో బీజేపీని వెనక్కి నెట్టిన కాంగ్రెస్

ABN, First Publish Date - 2021-10-03T23:11:28+05:30

బెంగాల్‌లో బీజేపీని వెనక్కి నెట్టిన కాంగ్రెస్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో దూకుడు మీదున్న భారతీయ జనతా పార్టీ తాజా ఉప ఎన్నికల్లో దారుణంగా చతికిల పడిపోయింది. తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీ కంటే వెనుకంజలో ఉండడం మాట అటుంచితే కాంగ్రెస్ పార్టీ కంటే కూడా వెనకబడి పోవడం గమనార్హం. రెండు లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఓట్లు సాధించింది. మార్చి-ఏప్రిల్‌లో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 2.92 శాతం ఓట్లకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ.. తాజా ఉప ఎన్నికల్లో 18 శాతానికి పైగా ఓట్లు సంపాదించింది. అయితే భవానీపూర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాలేదు.


ఇక ఈ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. బెంగాల్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో 38.13 శాతం ఓట్లు సంపాదించిన బీజేపీ.. కాంగ్రెస్ కంటే వెనకబడి పోవడం గమనార్హం. బీజేపీ కేవలం 14 శాతానికి పైగా ఓట్లతో మూడో స్థానంలో ఉంది. అటు అసెంబ్లీ ఉప ఎన్నికలో సైతం 22.3 శాతం ఓట్లే వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి పొత్తుతో ఎన్నికలకు పోయి డిపాజిట్ కూడా సాధించలేకపోయిన కాంగ్రెస్.. ఈ ఉప ఎన్నికలో ఒంటరిగానే వెళ్లి 18 శాతానికి పైగా ఓట్లు సంపాదించడం విశేషం.

Updated Date - 2021-10-03T23:11:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising