ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మమత నామినేషన్‌పై ప్రియాంక టిబ్రెవాల్ అభ్యంతరం

ABN, First Publish Date - 2021-09-14T21:45:40+05:30

పశ్చిమబెంగాల్‌లోని భవనాపూర్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థిగా పోటీలో ఉన్న ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని భవనాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థిగా పోటీలో ఉన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నామినేషన్‌పై  బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రెవాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈమేరకు భవానీ‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారికి ప్రియాంక ఎలక్షన్ ఏజెంటు సజల్ ఘోష్ లేఖ రాశారు. తనపై ఉన్న పెండింగ్ క్రిమినల్ కేసులను వెల్లడించడంలో మమత విఫలమయ్యారంటూ ఆ లేఖలో ఘోష్ అభ్యంతరం లేవనెత్తారు. మమతా బెనర్జీపై ఉన్న క్రిమినల్ కేసులపై‌ వివిధ వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలను లేఖలో ఆయన ప్రస్తావించారు.


కాగా, భవనాపూర్ నియోజకవర్గం నుంచి ప్రియాంక టిబ్రెవాల్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఉప ఎన్నికలు అన్యాయంపై జరిపే పోరాటంగా ఆమె అభివర్ణించారు. మమతకు పోటీగా తమ అభ్యర్థిని నిలబెట్టడం లేదని ఈనెల 8న కాంగ్రెస్ ప్రకటించడంతో ప్రధాన పోటీ మమత, టిబ్రేవాల్ మధ్యే నెలకొంది. సెప్టెంబర్ 30న ఉప ఎన్నికల పోలింగ్ జరుగనుండగా, అక్టోబర్ 3న ఫలితాలు వెలువడతాయి.

Updated Date - 2021-09-14T21:45:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising