ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూకదాడుల పితామహుడు రాజీవ్ గాంధీనే: రాహుల్‌పై బీజేపీ అటాక్

ABN, First Publish Date - 2021-12-21T23:01:41+05:30

మంగళవారం ఉదయం రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘2014కి ముందు ‘లించింగ్’ అనే పదమే వినిపించలేదు’’ అని హిందీ, ఇంగ్లీషులో ట్వీట్ చేశారు. దానికి ‘థాంక్యూ మోదీజీ’ అనే హ్యాష్‌ట్యాగ్ జత చేశారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: 2014కి ముందు దేశంలో మూకదాడులు ఉండేవి కావని, మోదీ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచే ఇవి ప్రారంభమయ్యాయని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ తిప్పికొట్టింది. మూకదాడుల పితామహుడు కాంగ్రెస్ నేత, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీయేనని అంటూనే ఇందిరా హత్య అనంతరం జరిగిన అల్లర్లపై రాజీవ్ చేసిన వ్యాఖ్యలను ఉదాహరణ చూపుతూ తీవ్ర విమర్శలు గుప్పించారు.


బీజేపీ ఐటీసెల్ ఇంచార్జ్ అమిత్ మాల్వియా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ రాజీవ్ ఒకానొక సభలో మాట్లాడుతున్న వీడియోను షేర్ చేస్తూ ‘‘సిక్కుల మారణహోమాన్ని సమర్ధిస్తున్న మూకదాడుల పితామహుడైన రాజీవ్ గాంధీని మీరు ఇక్కడ చూడొచ్చు. కాంగ్రెస్ నేతలు వీధుల్లోకి వచ్చి ‘రక్తానికి ప్రతీకారం రక్తంతోనే తీర్చుకుంటాం’ అని నినాదాలు చేశారు. సిక్కు మహిళలపై అత్యాచారాలు చేశారు. సిక్కు పురుషులను కుక్కలను విసిరేసినట్లు కాలుతున్న టైర్లలో విసిరేశారు’’ అని ట్వీట్ చేశారు.


మంగళవారం ఉదయం రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘2014కి ముందు ‘లించింగ్’ అనే పదమే వినిపించలేదు’’ అని హిందీ, ఇంగ్లీషులో ట్వీట్ చేశారు. దానికి ‘థాంక్యూ మోదీజీ’ అనే హ్యాష్‌ట్యాగ్ జత చేశారు. కాగా, ఈ ట్వీట్‌ను రిట్వీట్ చేస్తూ కాంగ్రెస్ హయాంలో దేశవ్యాప్తంగా జరిగిన అల్లర్లు ఇవేనంటూ అమిత్ మాల్వియా రాసుకొచ్చారు.

Updated Date - 2021-12-21T23:01:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising