ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘బిట్‌ కాయిన్‌ కుంభకోణంపై సమగ్ర విచారణ జరపాలి’

ABN, First Publish Date - 2021-11-10T17:50:53+05:30

రాష్ట్రంలో బిట్‌ కాయిన్‌ కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నేతల ప్రమేయం ఉందో, ప్రతిపక్షాల పాత్ర ఉందో నిగ్గుతేల్చే దిశలో సమగ్ర విచారణ జరపాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కాంగ్రెస్‌ డిమాండ్‌ 

- ఆధారాలుంటే సుప్రీంకోర్టుకు అందజేయండి 

- బీజేపీ సవాల్‌ 


బెంగళూరు(Karnataka): రాష్ట్రంలో బిట్‌ కాయిన్‌ కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నేతల ప్రమేయం ఉందో, ప్రతిపక్షాల పాత్ర ఉందో నిగ్గుతేల్చే దిశలో సమగ్ర విచారణ జరపాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ప్రతిపక్షనేత సిద్దరామయ్య మైసూరులో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. విచారణ ప్రారంభమైతే ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను ఆధారాలను అందించేందుకు తాము సిద్ధమన్నా రు. అసలు విచారణ జరపకుండా సాక్ష్యాలు అడగడం విడ్డూరంగా ఉందన్నారు. అవసరమైతే కోర్టుకు తన వద్ద ఉన్న సాక్ష్యాలు అందచేస్తానన్నారు. బిట్‌ కాయిన్‌పై అధికార పార్టీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. మరోవైపు బిట్‌ కాయిన్‌ వ్యవహారంలో కాంగ్రెస్‌వి అర్థంపర్థం లేని ఆరోపణలని బీజేపీ కొట్టిపారేసింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి నగరంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. బిట్‌ కాయిన్‌ వ్యవహారంపై ఇప్పటికే విచారణ జరుగుతోందన్నారు. కాంగ్రెస్‌ నేతలు తమ వద్ద ఆధారాలు ఉంటే సుప్రీంకోర్టుకు సమర్పించవచ్చునని అందుకు తమ అభ్యంతరం లేదన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజలను దారి తప్పించేందుకే కాంగ్రెస్‌ బిట్‌కాయిన్‌పై దుష్ప్రచారం చేస్తోందన్నారు. 

Updated Date - 2021-11-10T17:50:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising