ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేరళలో వెలుగుచూసిన Bird flu...కోళ్లు, బాతులను చంపాలని ఆదేశం

ABN, First Publish Date - 2021-12-10T15:47:05+05:30

కేరళ రాష్ట్రంలోని కుట్టనాడ్ ప్రాంతంలో తాజాగా బర్డ్ ఫ్లూ కేసులు వెలుగుచూశాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగంలో దిగిన ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలోని కుట్టనాడ్ ప్రాంతంలో తాజాగా బర్డ్ ఫ్లూ కేసులు వెలుగుచూశాయి. అల్లపుజాలోని కుట్టనాడ్ ప్రాంతంలో బర్డ్ ఫ్లూ తాజాగా వెలుగుచూసిన బర్డ్ ఫ్లూ కేసులను అధికారులు ధృవీకరించారు. బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లోని కోళ్లు, బాతులను చంపాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బర్డ్ ఫ్లూ ప్రబలకుండా నిరోధించేందుకు అధికారులు కోళ్లు, బాతులను చంపేందుకు వీలుగా ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేశారు.అలప్పుజా జిల్లాలోని తకజీ పంచాయతీ కుట్టనాడ్ ప్రాంతంలో ఒక రైతు పెంచిన వేలాది బాతులు చనిపోయాయి. మరణించిన బాతుల శాంపిళ్లను భోపాల్‌ నగరంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్‌కు పంపించగా బర్డ్ ఫ్లూ అని నిర్ధారించారు.


సరిహద్దు జిల్లాల్లో ఈ వ్యాధి ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని కేరళ ప్రభుత్వం ఆదేశించింది. బర్డ్ ఫ్లూ ప్రబలిన ప్రాంతంలోని కిలోమీటరు పరిధిలో ఉన్న బాతులు, కోళ్లు, గుడ్లు, ఇతర పక్షులను చంపాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది కేరళలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడం ఇది రెండోసారి. బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో కేరళ రాష్ట్రంలో కలకలం రేగింది. 


Updated Date - 2021-12-10T15:47:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising