ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లి చేసుకున్న బిల్ గేట్స్ కూతురు

ABN, First Publish Date - 2021-10-17T22:45:27+05:30

బిల్, మిలిందలకు జెన్నిఫర్ పెద్ద కూతురు. కాలిఫోర్నియా లెవీ లీగ్ యూనివర్సిటీ నుంచి 2018లో అర్థశాస్త్రంలో డిగ్రీ పట్టా తీసుకున్నారు. ఈ మధ్యే ఒక న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిన్నారులు, యూత్, చటాలు, జూవైనల్ వ్యవస్థ గురించి చదవాలని ఉందని చెప్పారు. చిన్నారుల మానసిక, సామాజిక పరిస్థితులపై అధ్యయనం చేయాలని ఉన్నట్లు చెప్పుకొచ్చారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: బిల్‌ గేట్స్, మెలిందా గేట్స్‌ల కూతరు జెన్నిఫర్ గేట్స్ పెళ్లి చేసుకున్నారు. 25 ఏళ్ల జెన్నిఫర్ గేట్స్.. ఒలింపిక్ షో జంపర్ అయిన నాయెల్ నాస్సర్‌ని శనివారం వివాహమాడారు. వీరి నిశ్చితార్థం ఈ ఏడాది మొదట్లో జనవరిలోనే అయింది. కాగా, ఏడు నెలల అనంతరం వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.


బిల్, మిలిందలకు జెన్నిఫర్ పెద్ద కూతురు. కాలిఫోర్నియా లెవీ లీగ్ యూనివర్సిటీ నుంచి 2018లో అర్థశాస్త్రంలో డిగ్రీ పట్టా తీసుకున్నారు. చదువు, సమాజంపై జెన్నిఫర్‌కు ఆసక్తి ఎక్కువ. ఈ విషయమై ఈ మధ్యే ఒక న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిన్నారులు, యూత్, చటాలు, జూవైనల్ వ్యవస్థ గురించి చదవాలని ఉందని చెప్పారు. చిన్నారుల మానసిక, సామాజిక పరిస్థితులపై అధ్యయనం చేయాలని ఉన్నట్లు చెప్పుకొచ్చారు. జెన్నిఫర్‌కు గుర్రాలు అంటే చాలా ఇష్టమట. ఆ ఇష్టంతోనే తమ తల్లిదండ్రులను ఒప్పించి లోకల్ బార్న్ గుర్రాల్ని కొన్నట్లు వెల్లడించారు.


ఇదిలా ఉంటే.. బిల్‌ గేట్స్‌ దంపతులు తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్టు మే 4న ప్రకటించారు. తమ 27 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నట్లు సోమవారం రాత్రి గేట్స్ ట్వీట్ ద్వారా తెలిపారు. ‘‘ఎన్నో సమాలోచనలు, ఎంతో మథనం తర్వాత మా వైవాహిక బంధాన్ని ముగించాలని నిర్ణయానికి వచ్చాం’’ అని గేట్స్ ట్వీట్ చేశారు.

Updated Date - 2021-10-17T22:45:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising