ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

liquor banను ఉల్లంఘించిన ఉద్యోగులపై కఠిన చర్యలు

ABN, First Publish Date - 2021-11-17T13:26:37+05:30

రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని ఉల్లంఘించిన ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్ర అధికారులను ఆదేశించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆదేశం

పాట్నా(బీహార్): రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని ఉల్లంఘించిన ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్ర అధికారులను ఆదేశించారు.ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధ్యక్షతన మద్యపాన నిషేధంపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగిన తర్వాత ఈ ఆదేశాలు జారీ చేశారు. మద్యపాన నిషేధానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోని పోలీస్ స్టేషన్ల సిబ్బందిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు.బీహార్ రాష్ట్రంలో నిషేధాన్ని వెనక్కి తీసుకునే ప్రశ్నే లేదని అక్రమ మద్యం వ్యాపారులపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం నితీశ్ కుమార్ హెచ్చరించారు.


మద్యం అమ్మకాలు, వినియోగంలో నిమగ్నమైన వారిని గుర్తించాలని డీజీపీని కోరినట్లు సీఎం చెప్పారు.మద్య నిషేధానికి మెజారిటీ ప్రజలు అనుకూలంగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదని నితీశ్ అన్నారు. కొంతమంది వ్యక్తులు మద్యనిషేధానికి అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని, కానీ వారు  విజయం సాధించలేరని నితీష్ చెప్పారు.


Updated Date - 2021-11-17T13:26:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising