ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనా నుంచి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో ఢిల్లీలో ల్యాండైన భారీ విమానం.. కొవిడ్ వేళ నయా రికార్డ్!

ABN, First Publish Date - 2021-05-17T01:33:10+05:30

చైనా నుంచి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను మోసుకొచ్చిన విమానం నేటి మధ్యాహ్నం ఢిల్లీలో ల్యాండైంది. దాదాపు 100 టన్నుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: చైనా నుంచి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను మోసుకొచ్చిన విమానం నేటి మధ్యాహ్నం ఢిల్లీలో ల్యాండైంది. దాదాపు 100 టన్నుల బరువున్న 3600 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఇది తీసుకొచ్చింది. కరోనా సంక్షోభంతో భారత్ అల్లాడుతున్న వేళ ఒకే కన్సైన్‌మెంట్‌లో ఇంత భారీ సరుకును మోసుకుని భారత్‌కు రావడం ఇదే తొలిసారి.  చైనాలోని హాంగ్ఝౌ విమానాశ్రయం నుంచి బయలుదేరిన విశాలమైన బోయింగ్ 747-400 విమానం సరిగ్గా మధ్యాహ్నం 3:18 గంటలకు ఢిల్లీ చేరుకున్నట్టు బొల్లోర్ లాజిస్టిక్స్ ఇండియా నేషనల్ సేల్స్ హెడ్ జస్ప్రీత్ సింగ్ తెలిపారు.


బొల్లోర్ లాజిస్టిక్స్ ఇండియా అనేది మల్టీనేషనల్, లాజిస్టిక్స్ కంపెనీ. నేటి దిగుమతులను ఇదే చూసుకుంది. బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకుని సంక్లిష్టమైన లాజిస్టికల్ సవాళ్లను అధిగమించింది. 


కరోనా రెండే వేవ్‌తో అల్లాడుతున్న భారత్‌లో మెడికల్ ఆక్సిజన్‌, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లకు విపరీతమైన కొరత ఏర్పడింది. ఇప్పుడు ఢిల్లీ చేరుకున్న ఈ భారీ కన్సైన్‌మెంట్ ద్వారా ఢిల్లీ అవసరాలతోపాటు ఉత్తర భారతదేశంలో కరోనా బారినపడి విలవిల్లాడుతున్న చాలా రాష్ట్రాల అవసరాలు తీరే అవకాశం ఉంది.

Updated Date - 2021-05-17T01:33:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising