ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైడెన్ వైట్ హౌస్‌లో అడుగుపెట్టబోతుండగా అపశ్రుతి! ట్రంప్ అక్కసు అణుచుకోలేక..

ABN, First Publish Date - 2021-01-24T01:21:21+05:30

అమెరికా అధ్యక్ష పదవిలో కనసాగేందుకు డోనాల్డ్ ట్రంప్ చేయని ప్రయత్నం అంటూ లేదు. ‘ఎన్నికల్లో అవినీతి జరిగింది. ఈ ఫలితాలను అంగీకరించం, మా పోరాటం కొసాగుతుందంటూ తన మద్దతు దారులను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం ఓ దారుణ ఘటనకు దారితీసింది. ట్రంప్ ప్రసంగంతో రెచ్చిపోయిన ఆయన మద్దతు దారులు అమెరికా చట్టసభల నిలయమైన క్యాపిటల్ భవనంపై విరుచుకుపడుతున్న దృశ్యాలను చూసి యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. అయితే.. ఇంత జరిగాక కూడా ట్రంప్ తన అక్కసును మరోసారి వెళ్లగక్కారని అమెరికా మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు డోనాల్డ్ ట్రంప్ చేయని ప్రయత్నం అంటూ లేదు. ‘ అవినీతిమయమైన ఈ ఎన్నికల ఫలితాలను అంగీకరించం, మా పోరాటం కొసాగుతుంది’ అంటూ తన మద్దతు దారులను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం అమెరికా చరిత్రలోనే ఓ దారుణ ఘటనకు దారితీసింది. ట్రంప్ ప్రసంగంతో రెచ్చిపోయిన ఆయన మద్దతు దారులు అమెరికా చట్టసభల నిలయమైన క్యాపిటల్ భవనంపై విరుచుకుపడుతున్న దృశ్యాలను చూసి యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. అయితే.. ఇంత జరిగాక కూడా ట్రంప్ మరోసారి తన అక్కసును వెళ్లగక్కారని అమెరికా మీడియాలో తాజాగా కథనాలు చెబుతున్నాయి. 


కొత్త అధ్యక్షుడు వైట్ హౌస్‌లోకి అధికారికంగా అడుగుపెట్టే రోజున ట్రంప్ చివరిసారిగా తన వక్రబుద్ధిని బయటపెట్టుకున్నారని తాజా కథనాలు చెబుతున్నాయి. అధ్యక్షుడి హోదాలో బైడెన్ తొలిసారిగా వైట్ హౌస్‌లోకి అధికారికంగా అడుగుపెట్టబోతుండగా ఓ అపశ్రుతి జరిగిందని అక్కడి మీడియా చెబుతోంది. బైడెన్ దంపతుల రాగానే వైట్ హౌస్ ఎగ్జిక్యూటివ్ మాన్షన్ తలుపులు తెరుచుకోకపోవడంతో..వారు అక్కడే కొద్ది క్షణాల పాటు నిలబడిపోవాల్సి వచ్చిందని, దీని వెనుక ట్రంప్ ఉన్నారనేది ఈ వార్తల సారాంశం.


వాస్తవానికి కొత్త అధ్యక్షుడికి ట్రంప్ స్వయంగా వైట్ హౌస్ లోకి ఆహ్మానం పలకాల్సి ఉన్నా అందుకు ఆయన గతంలోనే నిరాకరించారు. ట్రంప్ స్థానంలో చీఫ్ అషర్(వైట్ హౌస్ వ్యవహారాలను పర్యవేక్షించే కీలక అధికారి) బైడెన్ దంపతులకు ఆహ్వానం పలకాలని. అయితే.. బైడన్ శ్వేతశౌధంలోకి అడుగుపెట్టే రోజునే చీఫ్ అషర్‌ను ట్రంప్ విధుల్లోంచి తొలగించారని వైట్ హౌన్ నూతన ప్రెస్ సెక్రెటరీ తెలిపారు . అంతేకాకుండా.. వైట్‌హౌస్‌లోని బట్లర్‌ను కూడా ట్రంప్ ఇంటికి పంపించడంతో తలుపులు తీసే వారు కరువై బైడెన్ దంపతులు ఇబ్బంది పడ్డారని అక్కడి మీడియా చెబుతోంది. 


అయితే.. తలుపు తెరుచుకోవడంలో జరిగిన ఆలస్యంపై ఇప్పటివరకూ ఎటువంటి అధికారిక వివరణా విడుదల కాలేదు. కేవలం 10 సెకెన్ల పాటే బెడన్ దంపతులు వేచి చూసినప్పటికీ ఈ అపశ్రుతి అప్పటికే పలువురి దృష్టిలో పడింది. ప్రోటోకాల్‌లో ఇలాంటి ఉల్లంఘన జరగడం చాలా బాధాకరం అని వైట్ హౌస్ మాజీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారట.

Updated Date - 2021-01-24T01:21:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising